కోటి వేంకనార్యుడు

18వ శతాబ్దపు తెలుగు కవి

కోటి వేంకనార్యుడు 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి.

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు "ఆంధ్రభాషార్ణవము" అనే అచ్చ తెలుగు నిఘంటువును పద్య రూపంలో రాసాడు.[1] దీనితో సమానమైన అచ్చ తెలుగు నిఘంటువు మరియొకటి లేదు. ఈకవి ఈపుస్తకమును శ్రీవిజయరఘునాథునిపుత్రు డైనరఘునాథరాజు ప్రేరణముచేత జేసి యాతని కంకితము చేసెను. ఈ రఘునాథరాజు రామనాథ సేతుపతి అయిన విజయరఘునాథరాజు కుమారుడని తోచుచున్నది. అట్లయిన పక్షమున రఘునాథరాజు 1734వ సంవత్సరము మొదలు 1747వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినందున గవియు నాకాలమునం దుండియుండవలెను. కవి గద్యమునందు దనబిరుదావళి నీప్రకారముగా వ్రాసికొనియున్నాడు.

ప్రచురణలు

మార్చు

ఇది తొలుత 1916లో మహామహోపాధ్యాయ శ్రీమాన్ పరవస్తు వేంకటరంగాచార్యులయ్యవారలం గారిచే ఆర్ష ముద్రశాలలో అచ్చయినది.వారి క్యాటిలాగ్ లో ఇది కోటి వేంకన కవి ప్రణీతము అని వ్రాసినారు. ఇది తెలుగు నిఘంటవులన్నింటొలోను గొప్పది. తెలుగునకు అమరకోశము వంటిది.అమరకోశము నందువలె కాండములు వర్గములు అన్నియుకలవు.దీనిలో క్రియావర్గము ఒకటి అధికము. అటుపై శ్రీవావిళ్ళ ప్రెస్ వారు 1931లో దీనిని ప్రచురించినారు. కానీ 1966 సంవత్సరమున ఏలూరు పట్టణమునందు వెంకట్రామన్ ఎండ్ కో అధ్యక్షులైన ఈసర వెంకట్రావు పంతులు గారిచే ముద్రించిన శిరోమణి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల (రీడర్, తెలుగుశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయము) వారిచే విరచితమైన ఆంధ్రశబ్దరత్నాకరము అనెడి అకారాది వర్ణక్రమబద్దమైన పెద్ద నిఘంటువులో అవతారిక 31వ పుటలో నుదురుపాటి వేంకటకవి దీనిని రచించినాడని తెలిపినారు. 18వ శతాబ్దంలో పుదుక్కోట సంస్థానమునందుండిన విద్వత్కవి ఈతడు అని తెలిపినారు. కానీ అటుపై వచ్చిన పెక్కు నిఘంటువుల ప్రచురణలలో కోటి వేంకనార్యుడే దీనిని రచించినాడని తెలుపినారు.

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. కోటి వేంకనార్యుడు (1931). ఆంధ్రభాషార్ణవము. మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సంస్. Retrieved 13 August 2020.