కోట్‌పల్లి ప్రాజెక్టు
కోట్‌పల్లి ప్రాజెక్టు (నాగసముద్రం సరస్సు) అనేది తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కొట్‌పల్లి మండలం, కొట్‌పల్లి గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు. మధ్యతరహా ప్రాజెక్టులో భాగంగా 9,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రధాన కట్ట, అలుగు, బేబీ కెనాల్‌తోపాటు కుడి, ఎడమ కాలువలు నిర్మించబడ్డాయి.[1]
కోట్‌పల్లి ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | కొట్‌పల్లి, వికారాబాదు జిల్లా, తెలంగాణ |
నిర్మాణం ప్రారంభం | 1967 |
చరిత్ర
మార్చు1967లో 24 అడుగుల ప్రాజెక్టు నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించబడింది.[2]
ఆధునీకరణ
మార్చుకుడి కాలువ ద్వారా 8,100 ఎకరాలు... ఎడమ, బేబి కాలువల ద్వారా 1,100 ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, బేబీ కెనాల్, కుడి, ఎడమ కాల్వల పునర్నిర్మాణం, మరమ్మతులకు ప్రతిపాదన పంపబడింది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేయబడింది.
పర్యాటకం
మార్చుఈ కోట్‌పల్లి ప్రాజెక్టు పర్యాటకప్రాంతంగా ఉండడంతో ఇక్కడికి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు.[3] ఈ ప్రాజెక్టులో నీటిలో కయాకింగ్, బోటింగ్ సదుపాయం కూడా ఉంది.[4]
రవాణా
హైదరాబాదు నుండి నుంచి 138 కిలోమీటర్లు, అనంతగిరి నుంచి 12 కిలోమీటర్లు, ధరూర్ చౌరస్తా నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. సొంత వాహనం లేనివారికి అందుబాటులో ప్రైవేట్ ఆటోలు ఉంటాయి.
ఆహారం
స్థానికులు కొంతమంది ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటుచేసుకుని పర్యాటకులకు ఆహారం అదించి జీవనోపాధి పొందుతున్నారు. మ్యాగీ న్యూడిల్స్, కోడిగుడ్లు, చికెన్ కబాబ్, చాయ్‌తోపాటు ఇతర ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
వసతి
వసతి కొరకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్వర్యంలోని హరిత హాటల్స్ అందుబాటులో ఉన్నాయి.[5]
మూలాలు
మార్చు- ↑ ABN (2022-10-29). "కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పరిశీలన". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
- ↑ ABN (2022-09-28). "కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునికీకరిస్తాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
- ↑ telugu, NT News (2021-12-05). "Kotpally : కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి." www.ntnews.com. Archived from the original on 2022-05-17. Retrieved 2023-06-26.
- ↑ Today, Telangana; Mohan, B. Krishna (2021-08-20). "Make a splash with kayaking at Kotpally". Telangana Today. Archived from the original on 2021-08-28. Retrieved 2023-06-26.
- ↑ telugu, NT News (2021-08-21). "kayaking | 'కయాకింగ్'కు కేరాఫ్ అడ్రస్ కోట్‌పల్లి రిజర్వాయర్". www.ntnews.com. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-08-21 suggested (help)