కోట రామస్వామి నాయుడు
కోట రామస్వామి నాయుడు (జూన్ 16, 1896) భారతదేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. భారత జట్టు తరపున డేవిస్ కప్ లో పాల్గొన్న మొట్టమొదటి తెలుగువాడు.[1]
ఆయన తండ్రి బుచ్చిబాబు నాయుడు. వారి కుటుంబం ఆయన తాత హయాంలో మద్రాసు వెళ్ళి స్థిరపడింది. అయిదుగురు అన్నదమ్ముల్లో ఈయన పెద్దవాడు. ఆయన కుటుంబంలో అందరూ క్రీడాకారులే. మద్రాసు, మైలాపూర్ లోని లజ్ హౌస్ అనే వారి ఇంటి ఆవరణలో రెండు టెన్నిస్ కోర్టులు, ఒక క్రికెట్ పిచ్ ఉండేవి. రెండు టెన్నిస్ కోర్టులలో ఒక దానిని మహిళలకు కేటాయించారు. కొంతమంది విదేశీయులు కూడా అక్కడ టెన్నిస్ ఆడటానికి వచ్చే వాళ్ళు. ఆటకు కావలసిన సామాగ్రిని వారే తెప్పించే వారు. బుచ్చిబాబు నాయుడు రోజూ ఉదయం గుర్రపు స్వారీ చేసేవాడు. వారి పిల్లలు ఇంట్లోనే చదువుకుంటూ క్రీడల్లో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు.
బుచ్చిబాబు, ఆయన సోదరులు కలిసి మద్రాసు క్రికెట్ అసోసియేషన్, మద్రాసు యునైటెడ్ క్లబ్ ను స్థాపించారు. 1908లో బుచ్చిబాబు ఆధ్వర్యంలో భారత యూరోపియన్ జట్ల మధ్య క్రికెట్ పోటీలు జరిగాయి. అవి జరిగిన కొద్దిరోజులకే ఆయన మరణించాడు. మరి కొద్దిరోజులకే ఆయన భార్య కూడా మరణించింది. అప్పటికి కోట రామస్వామి వయసు పన్నెండేళ్ళు. అప్పటి నుంచి తాత దగ్గరకు దత్తత వెళ్ళాడు.
మూలాలు
మార్చు- ↑ ఏకా, వెంకట సుబ్బారావు (July 2000). తెలుగు క్రీడా జగత్తులో ఆది పురుషులు. హైదరాబాదు: విశాలాంధ్ర. pp. 5–11.