కోనాపురంలో జరిగిన కథ
కోనాపురంలో జరిగిన కథ 2019లో విడుదలైన తెలుగు సినిమా. పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా బ్యానర్ పై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.బి.కృష్ణ దర్శకత్వం వహించాడు.[1]కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్, పోస్టర్‌ను అక్టోబర్ 22, 2019న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశాడు.[2] సయ్యద్ సోహైల్, అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్(సయ్యద్ సోహైల్), సునీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 నవంబర్ 8న విడుదలైంది.[3]
కోనాపురంలో జరిగిన కథ | |
---|---|
దర్శకత్వం | కె.బి.కృష్ణ |
రచన | కె.బి.కృష్ణ |
నిర్మాత | మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఈరుపుల శ్రీకాంత్ |
సంగీతం | సత్య కశ్యప్ |
నిర్మాణ సంస్థ | అనూష సినిమా |
విడుదల తేదీ | 2019 నవంబర్ 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకోనాపురంలో దాని పక్క గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి పదిహేను రోజులకు వరుసగా ఒకొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. దాంతో ప్రశాంతంగా ఉన్న ఆ రెండు ఊర్లు ఆ వరుస హత్యలతో ఉలిక్కి పడతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎలా జరుగుతున్నాయి ? ఎవరు చేస్తున్నారు ? హత్యలు చేస్తోన్న వారిని పట్టుకోవడానికి ఎలాంటి విచారణలు జరుగుతున్నాయి? చివరికీ హత్యలు చేస్తోన్న వ్యక్తి దొరుకుతారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
మార్చు- అనిల్ మొగిలి
- రేయాన్ రాహుల్
- సునీత
- జబర్దస్త్ కొమరం
- దేవా శ్వేతా
- అలీమ్ ఖాన్
- రాకేష్
- రాజేష్
- జబర్దస్త్ రాజమౌళి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: అనూష సినిమా
- నిర్మాతలు: మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె బి కృష్ణ
- సంగీతం: సత్య కశ్యప్
- సినిమాటోగ్రఫీ:ఈరుపుల శ్రీకాంత్
- పాటలు : పూర్ణాచారి
మూలాలు
మార్చు- ↑ Sakshi (8 November 2019). "రెండు ఊళ్ల గొడవ". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
- ↑ Mana Telangana (22 October 2019). "'కోనాపురంలో జరిగిన కథ'ను విజయవంతం చేయాలి". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
- ↑ The Times of India (8 November 2019). "Konapuramlo Jarigina Katha Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
- ↑ Andrajyothy (6 November 2019). "అందరికీ థియేటర్లు దొరుకుతాయి!". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
- ↑ http://www.tupaki.com. "Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News". tupaki. Retrieved 2023-06-14.
{{cite web}}
: External link in
(help)|last=