పుష్కరిణి

(కోనేరు నుండి దారిమార్పు చెందింది)

కోనేరు నేరుగా ఇక్కడికి దారితీస్తుంది, అయోమయనివృత్తి కొరకు చూడండి. కోనేరు (అయోమయ నివృత్తి)

తిరపతిలోని గోవిందరాజస్వామి ఆలయ కోనేరు.
తిరుమలలోని పుష్కరిణి

పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయ ప్రాంగణంలో ఏర్పరచిన దిగుడు బావి లేదా జలాశయం.పుష్కరిణి చతురస్రం లేక దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.పుష్కరిణిలోకి దిగడానికి నాలుగు వైపుల మెట్లు నిర్మించబడి ఉంటాయి.పుష్కరిణి లోతు తక్కువగాను పొడవు, వెడల్పు ఎక్కువగాను ఉంటుంది.దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోవడానికి, స్నానం చేయడానికి ఈ పుష్కరిణిలోని నీటిని ఉపయోగించుకుంటారు.వాటిని పుష్కారిణి అనే కాకుండా కోనేరు, కళ్యాణి, కుండా, సరోవరం, ఆలయ జలాశయం తీర్థ, తలాబ్, పుఖూరి అనే మొదలైన పేర్లతోకూడా అంటారు.భారతదేశంలోని వివిధ భాషలలో ప్రాంతాలలో కొన్ని జలాశయాలలో స్నానం చేస్తే, వివిధ దీర్ఘకాలక వ్యాధులు, అనారోగ్యాలు తగ్గుతాయాని చెబుతారు.[1]ప్రాచీన కాలంలోని సింధు లోయ నాగరికతలో భాగమైన గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజో-దారో లేదా ధోలావిరా వంటి నిర్మాణాలలో కొన్ని వైపులా అనేక దశలతో మెట్లు కలిగిన ఇటువంటి సాంస్కృతిక జలాశయాలు అవశేషాలు కనుగొనుట జరిగింది.[2]

పుష్కరిణి రూపురేఖ

మార్చు
 
హంపీలోని కృష్ణ పుష్కరిణి

పురాతన కాలం నుండి భారతదేశ ఆలయాల నిర్మాణంలో వీటిని ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలో రుతుపవనాలు వచ్చేంతవరకు ఎండలకాలంలో ప్రత్యామ్నాయంగా నీటి నిల్వ రూపకల్పనకు ముఖ్యమైందిగా భావించి నిర్మించబడ్డాయి.తరువాత కాలంలో ఆలయాలలోని జలాశయాలు వివిధ రూపురేఖలుతో నిర్మించుట ఒక కళారూపంగా మారింది.విజయనగర సామ్రాజ్యం రాజధాని,ఆధునిక పట్టణంగా భావించేే హంపి రాయల్ సెంటర్ వద్ద విజయనగరసామ్రాజ్య శిధిలాల వద్ద ఉన్న పెద్ద, రేఖాగణితంగా రూపుదిద్దుకున్న అద్భుతమైన స్టెప్డ్ ట్యాంక్ డిజైన్ కళకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇది ఆకుపచ్చ రాయితో పూర్తిగా కప్పబడి ఉంటుంది. కాలువ లేదు. ఇది జలచరాల ద్వారా నిండి ఉంది.[3] ట్యాంకులను కర్మ ప్రక్షాళన కోసం, పవిత్ర కర్మల సమయంలో ఉపయోగిస్తారు.ట్యాంక్‌లోని నీరు గంగా నది నీరుకు ప్రత్యామ్నాయంగా పవిత్రమైన నీటిగా పరిగణించబడుతుంది.[4]

పుష్కరణి రకాలు

మార్చు

మెట్ల భావి: ఇది లోతైన రాతి బావిగా నీటి మట్టానికి మెట్లు నిర్మాణం ఉంటుంది. దీనిని పశ్చిమ భారతదేశంలో దిగుడు భావి, ఉత్తర భారతదేశంలో బయోలి అంటారు. కొన్ని పుష్కరిణిలు రాజులచే నిర్మించబడ్డాయి. గొప్పగా అలంకరించబడినవి. కొన్ని లౌకిక ఉపయోగం కోసం ఎవరైనా ఇందులోని నీటిని పొందేవిధంగా ఉంది.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://templenet.com/suntemple.html
  2. http://news-sv.aij.or.jp/jabs/s1/jabs0208-019.pdf
  3. "Ancient India". www.art-and-archaeology.com. Retrieved 2020-08-30.
  4. Thapar, Binda (2004). Introduction to Indian Architecture. Singapore: Periplus Editions. p. 43. ISBN 0-7946-0011-5.
  5. "Water Harvesting Systems : Traditional Systems". www.rainwaterharvesting.org. Retrieved 2020-08-30.

వెలుపలి లంకెలు

మార్చు