కోయంబత్తూరు నగర పాలక సంస్థ

తమిళనాడు రాష్ట్రం లోని నగర పాలకసంస్థ

కోయంబత్తూరు నగర పాలక సంస్థ, తమిళనాడు రాష్ట్రానికి చెందింది. తమిళనాడు రాష్ట్రం లోని రెండవ అతిపెద్ద నగరం .

కోయంబత్తూరు నగర పాలక సంస్థ
లోగో
రకం
రకం
మున్సిపల్ కార్పొరేషన్
నాయకత్వం
జిల్లా కలెక్టర్
తీరు సమీరన్
ఎన్నికలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2011

చరిత్ర

మార్చు

కోయంబత్తూరు కార్పొరేషన్ 1866లో ఏర్పాటు చేశారు.మొదటి ఛైర్మన్ గా పారిశ్రామికవేత్త సర్ రాబర్ట్ స్టెయిన్స్ పనిచేసాడు .2011 లో, కోయంబత్తూర్ కార్పొరేషన్ సమీప ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా 105 km² ఉన్న విస్తీర్ణం 247 km²కి పెరిగింది.2012 ఉత్తమ కార్పొరేషన్ అవార్డు పొందింది.[1][2] [3][4][5][6]

భౌగోళికం

మార్చు

కోయంబత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం దక్షిణభూభాగంలో ఉంది. ఈ జిల్లాకు కేరళ రాష్ట్రానికి ఆనుకుని ఉంది. ఈ జిల్లా ఉత్తర, పడమర దిశలలో అభయారణ్యాలతో కూడుకున్న పడమటి కనుమల పర్వతశ్రేణుల మధ్య ఉపస్థితమై ఉంది. నగరానికి ఉత్తరదిశలో నీలగిరి బయోస్ఫేర్ రిజర్వ్ ఉంది ఈ జిల్లాగుండా ప్రవహిస్తున్న నొయ్యాల్ నది కోయంబత్తూరు నగరపాలికకు దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది.[7] కోయంబత్తూరు నగరం నొయ్యల్ మైదానంలో ఉపస్థితమై ఉన్నందున ఈ ప్రదేశంలో ఉన్న విస్తారమైన చెరువులకు నొయ్యల్ నది జలాలు, వర్షాల నుండి అందుతున్న జలాలతో నిండి ఉన్నాయి.[8] ఇది సముద్రమట్టానికి 101 అడుగుల ఎత్తులో ఉంది.

జనాభా గుణంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
187135,310—    
188138,967+10.4%
189146,383+19.0%
190153,080+14.4%
191147,000−11.5%
192168,000+44.7%
193195,000+39.7%
19411,30,348+37.2%
19511,98,000+51.9%
19612,86,000+44.4%
19713,56,000+24.5%
19817,04,000+97.8%
19918,16,321+16.0%
20019,30,882+14.0%
201110,50,721+12.9%

ఈ నగర పాలక సంస్థలో 2011 జనాభా లెక్కలు ప్రకారం జనాభా 1,050,721 ఇందులో 526,163 పురుషులు కాగా 524,558 మహిళలు ఉన్నారు. పురుషుల అక్షరాస్యత 94%, ఉండగా స్త్రీల అక్షరాస్యత 88% అక్షరాస్యులు ఉన్నారు.[9]

పరిపాలన

మార్చు

మధురై కార్పొరేషన్ పరిపాలనా సౌలభ్యం కోసం ఐదు జోన్లుగా విభజించారు.కార్పొరేషన్‌లోని మొత్తం 148 వార్డులు ఉన్నాయి. ఈ 148 మందికికి మేయర్ నేతృత్వం వహిస్తారు.కౌన్సిల్ నెలలో ఒకసారి సమావేశమవుతారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Imperial Gazetteer of India. Vol. 10. Clarendon Press. 1908. pp. 371–372.
  2. S. Muthiah (14 April 2003). "'Golden Tips' in the Nilgiris". The Hindu. Archived from the original on 1 July 2003. Retrieved 9 June 2010.
  3. Devika, J. (2005). Her-self: early writings on gender by Malayalee women, 1898-1938. Popular Prakashan. p. 112.
  4. P. Rajeswar Rao (1991). "R. K. Shanmukham Chetty". The Great Indian Patriots, Volume 2. Mittal Publications. p. 120. ISBN 8170992885, ISBN 978-81-7099-288-2.
  5. Palanithurai, Ganapathy (2007). A handbook for panchayati raj administration (Tamil Nadu). Concept Publishing Company. p. 80. ISBN 81-8069-340-6, ISBN 978-81-8069-340-3.
  6. "Best Corporation Award: and the credit goes to...?". Coimbatore. The Hindu. 2012-08-17. Retrieved 2012-08-17.
  7. "Noyyal flows on like a quiet killer". Deccan Chronicle. 28 January 2011. Archived from the original on 14 ఫిబ్రవరి 2011. Retrieved 9 May 2011.
  8. "A river runs through it". The Hindu. 28 January 2006. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 9 May 2011.
  9. "Coimbatore City Population Census 2011-2021 | Tamil Nadu". www.census2011.co.in. Retrieved 2021-10-20.