కోయిల్ సాగర్ ప్రాజెక్టు
కోయిల్ సాగర్ (Koil Sagar) ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి.[1][2] జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. మండల కేంద్రమైన దేవరకద్రకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.
ప్రాజెక్టు వివరాలు
మార్చు1945లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలలోని 12 వేల ఎకరాల సాగు భూమికి నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.276TMC లు.
పర్యాటకం
మార్చురెండు కొండల మధ్య నిర్మించబడిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేయడానికి పనులు ప్రారంభమైనవి.[3] కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-27.
- ↑ నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
- ↑ Namasthe Telangana (9 June 2021). "కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
- ↑ Namasthe Telangana (17 March 2022). "కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.