ప్రపంచ దేశాల దృష్టంతా కొవిడ్‌-19 టీకా తయారీలో ఉన్నాయి.ఇప్పటికి 20 వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి.వీటిలో ఒకదానిని నేరుగా మనుషులపైనే ప్రయోగిస్తున్నారు.మిగతా వాటిని జంతువులపై ప్రయోగిస్తున్నారు.ఇవి విజయవంతం అయితే మనుషులపై ప్రయోగాలు మొదలు పెడతారు. ఈ ఏడాది చివరాఖరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు.

SARS-CoV-2 without background.png

టీకాను తయారు చేయడానికి నిధులుసవరించు

టీకాల అభివృద్ధి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కరోనా వైరస్‌కు టీకా, ఔషధాల అభివృద్ధికి ఉమ్మడిగా నిధులిస్తామని జీ-20 దేశాలు ప్రకటించాయి. ఓస్లో కేంద్రంగా పనిచేసే ‘ద కోలేషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌’ (సెపీ) 200 కోట్ల డాలర్ల తోడ్పాటు అందిస్తామని తెలిపింది. అమెరికా కూడా తన హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ విభాగం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) ద్వారా పలు కంపెనీలకు నిధులు అందిస్తోంది.

టీకా తయారీసవరించు

టీకా అభివృద్ధికి తొలుత వైరస్‌ ఆకృతిని, డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏను గుర్తించాలి. తర్వాత మనుషుల్లో ఆ వైరస్‌ ఎలా పనిచేస్తుందో పరీక్షలు చేస్తారు.

టీకాకు ప్రభుత్వ అనుమతులు రావాలంటే 3 దశల్లో మానవులపై విజయవంతంగా ప్రయోగించాలి. ఒక్కో దశకు 6-8 నెలలు పడుతుంది. ఈ దశలను అధిగమించి ముందుకు సాగే టీకాలు అతికొద్ది సంఖ్యలోనే ఉంటాయి.

తప్పు సమాచారంసవరించు

కొవిడ్‌ -19 వైరస్కి ఇప్పటికే ఒక టీకా అందుబాటులో ఉందని పేర్కొంటూ సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు.[1][2]

మూలాలుసవరించు

  1. Kertscher T (23 January 2020). "No, there is no vaccine for the Wuhan coronavirus". PolitiFact. Poynter Institute. Archived from the original on 7 February 2020. Retrieved 7 February 2020.
  2. McDonald J (24 January 2020). "Social Media Posts Spread Bogus Coronavirus Conspiracy Theory". FactCheck.org. Annenberg Public Policy Center. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 8 February 2020.

వెలుపలి లంకెలుసవరించు