కౌన్సిలింగ్ సేవలు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(ఆగస్టు 2018) |
కాలేజీ లలో విద్యార్థులకు కౌన్సిలింగు సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటం గురించి నేడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తరువాత ప్రభుత్వం అన్ని విద్యాసంస్ఠల్లోనూ కౌన్సిలర్లను నియమించాలని అభిప్రాయపడింది. మెంటరింగు (Mentoring) కూడా ఇదే తరహా సేవేగానీ అది మరికొంత క్లిష్టమయినది. యువతరానికి సైకలాజికల్ ఆసరా చాలా అవసరం. కౌన్సిలింగు అనేది చాలా సహజంగా మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్దలు, పాఠశాలలో గురువులూ అస్తమానమూ సలహాలు ఇస్తూనే ఉంటారు. మన చరిత్రలోనూ, పురాణాలలోనూ దీనికి మంచి ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు-అర్జునుడూ, రామకృష్ణ పరమహంస-వివేకానందుడూ, క్రీస్తూ ఆయన శిష్యులూ, ఇలా అనేక మంది మహనీయులు ఇలాటి కౌన్సిలింగు సంబంధంలో ఉన్నారు.
నిర్వచనం
మార్చుకౌన్సిలింగు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య (సాధారణంగా వీరిలో ఒకరు వయసులోనూ, అనుభవం లోనూ పెద్దవారై ఉంటారు) ఒక నమ్మకం కూడిన మార్గదర్శక సంబంధం. ఇందులో సలహాసంప్రదింపులూ, కలిసి సమయం గడిపే వెసులుబాటు, ఇష్టం, ఆవశ్యకత, ఉంటాయి. వృత్తి రీత్యా కౌన్సిలర్ లు ఉంటారు. వీరు కొంత ఫీజు తీసుకుని ఈ సేవలు అందిస్తారు. ఈ వ్యాసంలో చర్చించబోయేది విద్యాలయాల్లో జరిగే కౌన్సిలింగు గురించే. విద్యాలయాల్లో కౌన్సిలర్ లు సాధారణంగా ఏదో ఒక రకమైన శిక్షణ పొంది ఉండడం అవసరం. వయసు, అనుభవంతో బాటు కౌన్సిలింగులో కొంతైనా శిక్షణ ఉందాలి. ఎక్కువ భాగం ఏదో ఒక సబ్జెక్టు బోధించే అధ్యాపకులే ఒకరిద్దరు కౌన్సిలర్ లుగా ఉంటారు. వీరు కొంత కౌన్సిలింగు శిక్షణ తీసుకుని ఉంటే మంచిది.
కౌన్సిలర్ (సలహాదారు) అందుబాటులో ఉండే వ్యక్తి అయి ఉండాలి. వివేకం, సానుభూతి, విద్యార్థుల పట్ల గౌరవం, ప్రేమ కలిగిన వాడై ఉండాలి. శ్రధ్ధగా వినే స్వభావం ఉండాలి. విద్యార్థి చెప్పిన విషయాలను గోప్యంగా ఉంచే గుణం ఉండాలి. సమస్యను అర్థం చేసుకుని, దానికి తగిన పరిష్కారం ఆలోచించదానికి విద్యార్థికి తోడ్పడాలి. ఆ సమస్యలో తానే ఒక భాగమై ఉండకూడదు. కౌన్సిలింగు సంబంధంలో దగ్గర బంధువులు మంచి కౌన్సిలర్ గా ఉండలేరు.