క్యారట్ మెంతి పచ్చడి

క్యారట్ మెంతి పచ్చడి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీనిని ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

కావలసిన పదార్థాలు

మార్చు
  • క్యారెట్లు - 2
  • మెంతి ఆకు - 1 కప్పు
  • మినప్పప్పు, శనగపప్పు - 1 టేబుల్ స్పూను చొప్పున
  • జీలకర్ర - 1 టీ స్పూను
  • ఆవాలు - అర టీ స్పూను
  • ఎండుమిర్చి - 2
  • వెల్లుల్లి రేకలు - 5
  • పచ్చిమిర్చి - 2
  • బెల్లం తురుము - 1 టేబుల్ స్పూను
  • ఉప్పు - రుచికి తగినంత
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
  • నూనె - 1 టేబుల్ స్పూను
  • తాలింపు దినుసులు - సరిపడినన్ని.

తయారుచేసే విధానం

మార్చు
  1. అర టీ స్పూను నూనెలో వెల్లుల్లి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు దోరగా వేగించి పక్కనుంచాలి.
  2. అదే కడాయిలో టీ స్పూను నూనెలో పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు (పచ్చివాసన పోయేవరకు) 4 నిమిషాలు వేగించి తీసెయ్యాలి.
  3. మరో అర టీ స్పూను నూనెలో మెంతి ఆకులు కూడా వేగించాలి.
  4. వేగించుకున్న వరసలోనే మిక్సీలో పప్పులు, క్యారెట్ ముక్కలు, మెంతి ఆకులు ఒక్కొక్కటిగా వేస్తూ రుబ్బుకోవాలి.
  5. తర్వాత తాలింపుతో పాటు నిమ్మరసం కలుపుకోవాలి.
  6. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి బాగుంటుంది.