క్యూమాడ గ్రాండే ద్వీపం

క్యూయిమాడ గ్రాండేనీ ద్వీపాన్ని పాముల ద్వీపం అని కూడా పిలుస్తారు.బ్రెజిల్ తీరంలో ఉన్న ఒక ద్వీపం.ఈ ద్వీపం పరిమాణంలో చిన్నది,కేవలం 43 హెక్టార్లు ఉంది.ఈ ద్వీపంలో ఎక్కువగా విషపూరితమైన పాములు ఉన్నాయి.ప్రజల సందర్శనకు ద్వీపాన్ని ప్రమాదకరం.బ్రెజిల్ నేవీ, పరిశోధకులకు మాత్రమే ఈ ద్వీపంలోకి వెళ్ళడానికి అనుమతి ఉంది.భూమి మీద ఉన్న భయంకరమైన స్థలంగా భావిస్తారు.10వేల ఏళ్ల క్రితం ఈ స్నేక్ దీపం కూడా బ్రెజిల్ యొక్క ప్రధాన భూభాగంలో భాగంగా ఉండేది. అయితే సముద్ర మట్టాలు పెరిగినప్పుడు, భూభాగాన్ని వేరు చేసి ద్వీపంగా మార్చింది.[1]

క్యూమాడ గ్రాండే ద్వీపం
Nickname: పాముల ద్వీపం
ద్వీపం
క్యూమాడ గ్రాండే ద్వీపం is located in Brazil
క్యూమాడ గ్రాండే ద్వీపం
క్యూమాడ గ్రాండే ద్వీపం
Location of Ilha da Queimada Grande in Brazil
భూగోళశాస్త్రం
ప్రదేశంఅట్లాంటిక్ మహాసముద్రం
అక్షాంశ,రేఖాంశాలు24°29′10″S 46°40′30″W / 24.48611°S 46.67500°W / -24.48611; -46.67500
విస్తీర్ణం430,000 మీ2 (4,600,000 sq ft)
అత్యధిక ఎత్తు206 m (676 ft)
నిర్వహణ
బ్రెజిల్
జనాభా వివరాలు
జనాభాఇక్కడ జనాభా నివసించడం నిషేధం

భౌగోళిక

మార్చు

బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్ర తీరానికి దాదాపు 33 కిలోమీటర్లు దూరంలో ఈ ద్వీపం ఉంది. సుమారుగా 430,000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపం సముద్ర మట్టం నుండి సముద్ర మట్టానికి 676 అడుగులు ఎత్తులో ఉంది.

చరిత్ర

మార్చు

అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఈ ద్వీపం ఉంది.ఈ ద్వీపం దాదాపు 110 ఎకరాల్లో 430,000 పాములు ఉన్నాయి.ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు విషపూరితమైనవి. ఇక్కడ ఇతర జీవరాశులు బతుకడం అసాధ్యం.ఈ ద్వీపంలో లాన్స్‌హెడ్ పాముల ఎక్కువగా ఉంటాయి.ప్రపంచంలోని ప్రాణాంతక సర్పాలలో ఇది ఒకటి.లాన్స్ హెడ్స్ ఒకటిన్నర పొడవు వరకు పెరుగుతాయి.ఈ జాతి పాములు ఈ ద్వీపంలో 2,000 నుండి 4,000 పాములు ఉన్నాయని అంచనా వేశారు. ఈ లాన్స్ హెడ్స్ చాలా విషపూరితమైనవి.ఇక్కడ ఉన్న అరుదైన పాము జాతుల నుంచి వచ్చే విషం కొని రకాల గుండె జబ్బులకు ఉపయోగపడుతుంది. దీంతో ఈ విషానికి బ్లాక్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది.[2]

మూలాలు

మార్చు
  1. "Instituto Chico Mendes de Conservação da Biodiversidade - Conhecendo a Ilha da Queimada Grande". www.icmbio.gov.br (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.
  2. ARIE das Ilhas Queimada Pequena e Queimada Grande (in పోర్చుగీస్), ISA: Instituto Socioambiental, retrieved 2016-11-20