కె.కె. అగర్వాల్

భారతీయ హృద్రోగ నిపుణుడు
(క్రిషన్ కుమార్ అగర్వాల్ నుండి దారిమార్పు చెందింది)

క్రిషన్ కుమార్ అగర్వాల్ (5 సెప్టెంబర్ 1958 - 17 మే 2021) భారతీయ వైద్యుడు, సీనియర్ కార్డియాలజిస్ట్. అతను కాన్ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఆసియా అండ్ ఓషియానియా (సిఎంఎఎవో) అధ్యక్షుడు, హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గత జాతీయ అధ్యక్షుడు. వైద్య రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2010లో భారత ప్రభుత్వం ఆయనను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.

క్రిషన్ కుమార్ అగర్వాల్
జననం(1958-09-05)1958 సెప్టెంబరు 5
న్యూఢిల్లీ, భారతదేశం
మరణం2021 మే 17(2021-05-17) (వయసు 62)
న్యూఢిల్లీ, భారతదేశం
విద్యాసంస్థనాగపూర్ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
వృత్తివైద్యుడు, లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
పురస్కారాలు

జీవిత చరిత్ర

మార్చు

డాక్టర్ అగర్వాల్ 5 సెప్టెంబర్ 1958న జన్మించాడు. [1] 1979 లో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.ఎస్ చేసి 1983లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఒక ఎమ్.డి పట్టా పొందాడు. [2] అతను 2017 వరకు భారతదేశంలోని న్యూఢిల్లీలోని మూల్ చంద్ మెడ్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. [3]

అగర్వాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గౌరవ సెక్రటరీ జనరల్ గా, ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ చైర్మన్ గా, ఐఎంఏ జాతీయ గౌరవ ఆర్థిక కార్యదర్శిగా, ఐఎంఏకు చెందిన ఏకేఎన్ సిన్హా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా, ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఐఎంఏ న్యూఢిల్లీ శాఖ అధ్యక్షుడుగా, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీ ఢిల్లీ చాప్టర్ చైర్మన్ గా పనిచేశాడు.[4] ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా బోధించాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా, ఐజెసిపి గ్రూప్ చీఫ్ ఎడిటర్ గా ఉన్నాడు.[5] 2019 సెప్టెంబరులో "కాన్ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఆసియా అండ్ ఓషియానియా" (సి.ఎం.ఎ.ఎ.ఒ) అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ రెలిజియన్ వైస్ ఛైర్మన్ గా కూడా పనిచేశాడు.[6]

అగర్వాల్ ఆరోగ్యంపై పుస్తకాలను ప్రచురించాడు. పురాతన వైదిక వైద్యాన్ని ఆధునిక అల్లోపతితో మిళితం చేసి రాసిన అల్లోవేద వాటిలో ఒకటి.[7][8] ఎకోకార్డియోగ్రఫీపై ఆరు అధ్యాయాలతో అంతర్జాతీయ ఎకోకార్డియోగ్రఫీ పాఠ్యపుస్తకానికి ఆయన సహకారం అందించాడు.[9] ది అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ అండ్ సర్క్యులేషన్ వంటి అంతర్జాతీయ జర్నల్స్ లో సుమారు 14 ప్రచురణలు ఉన్నాయి; ఇండియన్ హార్ట్ జర్నల్, ది జర్నల్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ జర్నల్ ఆఫ్ హార్ట్ రీసెర్చ్ వంటి భారతీయ జర్నల్స్ లో 115 ప్రచురణలు ఉన్నాయి.[9]

భారతీయ ఇతిహాసం మహాభారతం అనేక మానసిక సమస్యలకు సమాధానాలు ఇస్తుందని, శ్రీకృష్ణుడు భారతదేశపు మొదటి సలహాదారు అని ఆయన పేర్కొన్నారు. 2005లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డుతో సత్కరించారు.[10]"విశ్వ హిందీ సమ్మాన్", "నేషనల్ సైన్స్ కమ్యూనికేషన్ అవార్డు", "ఫిక్కీ హెల్త్ కేర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు", "డాక్టర్ డిఎస్ ముంగేకర్ నేషనల్ ఐఎంఎ అవార్డు", "రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు" కూడా అందుకున్నారు.[9] 2010లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.[11]

17 మే 2021 నాడు, కోవిడ్ వ్యాధితో మరణించాడు.[12][13]

అవార్డులు

మార్చు
  • డాక్టర్. బి. సి. రాయ్ అవార్డు(2005)
  • ఫిక్కీ హెల్త్ కేర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  • డాక్టర్ డి ఎస్ ముంగేకర్ నేషనల్ ఐఎంఎ అవార్డు
  • రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు
  • పద్మశ్రీ పురస్కారం(2010)

మూలాలు

మార్చు
  1. Srivastava, Amitabh (2021-05-18). "Dr KK Aggarwal: A man devoted to public welfare and health awareness; void left by him won't be easy to fill". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2022-01-11.
  2. "Dr KK Aggarwal". www.mgims.ac.in. Retrieved 2022-01-11.
  3. "You are what you eat - Hindustan Times". web.archive.org. 2014-11-09. Archived from the original on 2014-11-09. Retrieved 2022-01-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Heart Care Foundation Fund". web.archive.org. 2020-08-15. Archived from the original on 2020-08-15. Retrieved 2022-01-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Dr KK Aggarwal elected as the new IMA general secretary - timesofindia-economictimes". web.archive.org. 2016-09-09. Archived from the original on 2016-09-09. Retrieved 2022-01-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Aggarwal, Dr. K.K. (2014). ""80 Ka Fundaa" can make you live beyond 80 years". Sarkari Mirror (Interview). Interviewed by Tarun Sharma. Retrieved 9 November 2014 – via Sarkarimirror.com.
  7. Singh, Riya (May 20, 2021). "Wave Hi Toh Hai, Chali Jayegi: A Tribute to Doctor KK Aggarwal". DTU Times. Archived from the original on 2023-07-05. Retrieved 2022-05-29. He had also published various books, the most notable one being Alloveda, in which he pitched the culmination of modern allopathic treatment with Ayurvedic remedies.
  8. "Allopathy & Vedas". kkaggarwal.com. Retrieved 2022-05-29.
  9. 9.0 9.1 9.2 "President - Dr K K Aggarwal, Padma Shri, Dr B C Roy National Awardee & DST National Science Communication Awardee". Heart Care Foundation. 2014. Archived from the original on 15 August 2020. Retrieved 9 November 2014.
  10. Das, Uddipta (27 July 2017). "Mahabharata offers answers on psychiatry, Lord Krishna was India's first counsellor: IMA chief KK Aggarwal". India.com (in ఇంగ్లీష్).
  11. "Padma 2010". Press Information Bureau, Government of India. 25 January 2010. Retrieved 7 November 2014.
  12. Khan, Sami (18 May 2021). "Breaking: Dr KK Aggarwal no more; Padma Shree Awardee succumbs to COVID". International Business Times (in ఇంగ్లీష్).
  13. "Dr KK Aggarwal passes away". The Indian Express. 18 May 2021.