క్రిస్టీన్ లగార్డ్

క్రిస్టీన్ మడేలీన్ ఒడెట్ లగార్డ్ (ఆంగ్లం: Christine Madeleine Odette Lagarde; జననం 1956 జనవరి 1) ఒక ఫ్రెంచ్ రాజకీయవేత్త, న్యాయవాది. ఆమె 2019 నుండి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా పనిచేసింది. 2011 నుండి 2019 వరకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) 11వ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆమె ఫ్రాన్స్ ప్రభుత్వంలో కూడా పనిచేసింది. ముఖ్యంగా 2007 నుండి 2011 వరకు ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిగా చేసింది. ఈ పదవిలన్నిటిలోనూ ఆమె మొదటి మహిళగా గుర్తింపుపొందింది.[1]

క్రిస్టీన్ లగార్డ్
2020లో క్రిస్టీన్ లగార్డ్
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్
Assumed office
2019 నవంబరు 1
Vice Presidentలూయిస్ డి గిండోస్
అంతకు ముందు వారుమారియో డ్రాగి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్
In office
2011 జులై 5 – 2019 సెప్టెంబరు 12
Deputy
  • జాన్ లిప్స్కీ
  • డేవిడ్ లిప్టన్
అంతకు ముందు వారుడొమినిక్ స్ట్రాస్-కాన్
తరువాత వారుక్రిస్టాలినా జార్జివా
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఫైనాన్స్ (ఫ్రాన్స్)
In office
2007 జూన్ 19 – 2011 జూన్ 29
ప్రథాన మంత్రిఫ్రాంకోయిస్ ఫిల్లన్
అంతకు ముందు వారుజీన్-లూయిస్ బోర్లూ
తరువాత వారుఫ్రాంకోయిస్ బరోయిన్
వ్యవసాయ మంత్రిత్వ శాఖ (ఫ్రాన్స్)
In office
2007 మే 18 – 2007 జూన్ 18
ప్రథాన మంత్రిఫ్రాంకోయిస్ ఫిల్లన్
అంతకు ముందు వారుడొమినిక్ బుస్సేరో
తరువాత వారుమిచెల్ బార్నియర్
మినిస్టర్ ఆఫ్ కామర్స్ (ఫ్రాన్స్)
In office
2005 జూన్ 2 – 2007 మే 15
ప్రథాన మంత్రిడొమినిక్ డి విల్లెపిన్
అంతకు ముందు వారుఫ్రాంకోయిస్ లూస్
తరువాత వారుహెర్వ్ నోవెల్లి
వ్యక్తిగత వివరాలు
జననం
క్రిస్టీన్ మడేలిన్ ఒడెట్ లాలౌట్

(1956-01-01) 1956 జనవరి 1 (వయసు 68)
9వ పారిస్ అరోండిస్మెంట్, ఫ్రాన్స్
రాజకీయ పార్టీయూనియన్ ఫర్ ఎ పాపులర్ మూవ్‌మెంట్
(2015కి ముందు)
ది రిపబ్లికన్స్
(2015 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
యూరోపియన్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి
విల్ఫ్రైడ్ లగార్డ్
(m. 1982; div. 1992)
సంతానం2
చదువుపారిస్ నాంటెర్రే యూనివర్సిటీ
సైన్సెస్ పో ఐక్స్
సంతకం

పారిస్‌లో పుట్టి పెరిగిన ఆమె పారిస్ నాంటెర్రే విశ్వవిద్యాలయంలో లా స్కూల్ నుండి డిగ్రీ పుచ్చుకుంది.[2][3] అలాగే, సైన్సెస్ పో ఐక్స్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందింది. పారిస్ బార్‌లో చేరిన తర్వాత, ఆమె 1981లో అంతర్జాతీయ న్యాయ సంస్థ బేకర్ & మెక్‌కెంజీలో అసోసియేట్‌గా చేరింది, లేబర్ అండ్ యాంటీ ట్రస్ట్, విలీనాలు, కొనుగోళ్లలో ప్రత్యేకత సాధించింది. ఆమె 1995 నుండి 1999 వరకు సంస్థ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలుగా చేసింది. 1999 - 2004ల మధ్య దాని అధ్యక్షురాలిగా ఎదిగింది.

2005 నుండి 2007 వరకు ఫారిన్ ట్రేడ్ మంత్రిగా నియమితులైనప్పుడు ఆమె ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది, ఆ సమయంలో మే నుండి 2007 జూన్ వరకు వ్యవసాయం, ఫిషరీస్ మంత్రిగా పనిచేసింది. ఆ తరువాత, ఆమె 2007 నుండి 2011 వరకు ఆర్థిక మంత్రిగా కూడా చేసింది. ఆమె పదవీ కాలంలో, 2000ల చివరి ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ ప్రతిస్పందనను పర్యవేక్షించింది, దీని కోసం ఫైనాన్షియల్ టైమ్స్ ఆమెను యూరోజోన్‌లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.[4]

2011 జలై 5న, ఆమె ఐదేళ్ల కాలానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్‌గా డొమినిక్ స్ట్రాస్-కాన్ స్థానంలో ఎన్నికయింది.[5][6][7] ఆమె నియామకం ఐ.ఎమ్.ఎఫ్ కి అధిపతిగా యూరోపియన్‌కి వరుసగా 11వ నియామకం.[8] ఆమె 2016 జలై 5 నుండి రెండవ ఐదేళ్ల కాలానికి ఏకాభిప్రాయంతో ఎంపిక చేయబడింది, ఈ పదవికి నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి ఆమె.[9] 2016 డిసెంబరులో, బెర్నార్డ్ టాపీ ఆర్బిట్రేషన్‌లో ఆమె పాత్రకు సంబంధించి నిర్లక్ష్యానికి ఫ్రెంచ్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది, కానీ పెనాల్టీ విధించలేదు.[10] ఆమె ఈసీబి అధ్యక్షురాలిగా నామినేషన్ వేసిన తరువాత ఐ.ఎమ్.ఎఫ్. పదవికి రాజీనామా చేసింది.

2019లో, మళ్లీ 2020లో, ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె రెండవ స్థానంలో నిలిచింది.[11][12]

మూలాలు మార్చు

  1. Hope, Katie (12 July 2019). "Christine Lagarde: The 'rock star' of finance". BBC (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 17 July 2019.
  2. "Le Nouvel Economiste". Nouveleconomiste.fr. Archived from the original on 9 July 2007. Retrieved 21 February 2014.
  3. Lagarde, Christine. "Promoting Peace, Tolerance, and Respect". Imf.org. Retrieved 4 June 2022.
  4. From Ralph Atkins; Andrew Whiffin; FT reporters (16 October 2009). "FT ranking of EU finance ministers". Financial Times. Retrieved 2 January 2010.
  5. "IMF Executive Board Selects Christine Lagarde as Managing Director". Press Release. IMF. 28 June 2011. Retrieved 28 June 2011.
  6. "Lagarde wins IMF top job, presses Greece on crisis". Reuters. 28 June 2011. Retrieved 1 July 2011.
  7. "Christine Lagarde named IMF chief". BBC News. 28 June 2011. Retrieved 28 June 2011.
  8. "IMF Managing Directors". IMF. 28 June 2011. Retrieved 1 September 2011.
  9. "IMF's Lagarde re-elected to second term". Deutsche Welle. Reuters, AFP. 19 February 2016. Retrieved 25 August 2016.
  10. "IMF head convicted of criminal charges over massive government payout". The Independent (in ఇంగ్లీష్). 19 December 2016. Retrieved 17 July 2019.
  11. "The World's Most Powerful Women 2019". Forbes (in ఇంగ్లీష్). Retrieved 19 February 2020.
  12. "The World's 100 Most Powerful Women 2020". Forbes (in ఇంగ్లీష్). Retrieved 9 December 2020.