క్రిస్ హిప్ కిన్స్

న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్ కిన్స్ 2023 జనవరి 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు[1]. జనవరి 19వ తేదీన జెసిండా ఆర్డెర్న్ ప్రధాన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడంతో న్యూజిలాండ్ 41 వ ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ఎన్నికయ్యారు[2]. 2008లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన క్రిస్ హిప్ కిన్స్ 2020లో కోవిడ్ - 19, పోలీస్ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2023 సంవత్సరం జనవరి 19వ తేదీన తాను ప్రధాని పదవి నుండి తప్పుకుంటున్నట్లు అప్పటి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు[3]. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు[4]. కరోనా సంక్షోభం, మైనారిటీ ఉచ కోత, ప్రకృతి వైపరీత్యాలు, ఎటువంటి పరిస్థితులైన ఆ సమయంలో ఆమె చూపిన సమయం మనం సర్వత్ర ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. 2023 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన న్యూజిలాండ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

మూలాలు :

  1. "న్యూజిలాండ్ 41వ ప్ర‌ధానిగా క్రిస్ హిప్కిన్స్.. నేడు ప్ర‌మాణ స్వీకారం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-25. Retrieved 2023-09-05.
  2. "Chris Hipkins: న్యూజిలాండ్‌ నూతన ప్రధానిగా క్రిస్‌ హిప్కిన్స్‌". Sakshi Education. Retrieved 2023-09-05.
  3. ABN (2023-01-21). "New Zealand PM: జసిందా స్థానంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-05.
  4. "న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్!". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-21. Retrieved 2023-09-05.