క్లస్టర్ బాంబు

(క్లస్టర్‌ బాంబు నుండి దారిమార్పు చెందింది)

సాధారణ బాంబుల వల్ల ఒక్క పేలుడు మాత్రమే జరుగుతుంది. కానీ క్లస్టర్‌ బాంబుల వల్ల భారీ సంఖ్యలో పేలుళ్లు జరుగుతాయి. ప్రతి బాంబులో భారీ సంఖ్యలో చిన్న బాంబులు ఉంటాయి. వీటిని రన్‌వేలను పేల్చివేయడానికి, పవర్‌ స్టేషన్‌లను ధ్వంసం చేయడానికి, భూమిలో ముందే అమర్చిన ల్యాండ్‌మైన్లను, రసాయన ఆయుధాలను ధ్వంసం చేయడానికి వాడతారు. వీటివల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి.. కొన్ని సార్లు వీటిని పేల్చి నప్పుడు అందులో నుంచి వేరుపడ్డ చిన్న బాంబులు కొన్ని పేలకుండా మిగిలిపోయి.. తర్వాత ఆ ప్రాంతానికి వచ్చేవారికి ప్రాణాపాయంగా పరిణమిస్తుంటాయి. దీంతోపాటు ఈ బాంబును ప్రయోగించిన ప్రాంతం కొంత మేరకు పూర్తిగా ధ్వంసమైపోతుంది. అందుకే 2010లో దీని ప్రయోగంపై అంతర్జాతీయ సమాజం నిషేధం విధించింది.[1]

A US Vietnam era BLU-3 క్లస్టర్ బాంబ్లెట్

మూలాలు

మార్చు
  1. "ఈనాడు పత్రికలో క్లస్టరు బాంబు గురించి". Archived from the original on 2016-02-16. Retrieved 2016-02-16.

ఇతర లింకులు

మార్చు