క్వీనీ హెచ్. సి. కెప్టెన్

క్వీనీ హెచ్.సి. కెప్టెన్ భారతీయ సామాజిక కార్యకర్త. ఆమె భారతదేశంలోని దృష్టి లోపం ఉన్న ప్రజల సంక్షేమానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. [1] ఆమె 1961 నుండి 1972 వరకు భారతదేశంలో అంధుల కోసం అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ అయిన నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్‌కు సహ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు.[1] ఆమె వైస్ ప్రెసిడెంట్‌గా, సంస్థ యొక్క ఫైనాన్స్ రైజింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసింది.[2] 1969లో న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్ కౌన్సిల్ ఫర్ ది బ్లైండ్ వెల్ఫేర్ ఆఫ్ వరల్డ్ అసెంబ్లీ నిర్వాహకుల్లో ఆమె ఒకతె. [3] ఆమె 1959లో రోమ్‌లో జరిగిన వరల్డ్ కౌన్సిల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్ యొక్క క్విన్-క్వెనియల్ కాన్ఫరెన్స్‌కు భారత ప్రతినిధి బృందానికి నాయకురాలు. భారత ప్రభుత్వం ఆమెకు 1974లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[4]

క్వీనీ హెచ్.సి.కెప్టెన్
జననంభారతదేశం
వృత్తిసామాజిక కార్యకర్త
ప్రసిద్ధిఅంధుల కోసం సేవ
పురస్కారాలుపద్మశ్రీ

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "National Association for the Blind". NGO Gateway. 2015. Archived from the original on 2 October 2012. Retrieved 14 June 2015.
  2. "History". NAB. 2015. Retrieved 14 June 2015.
  3. "Proceedings of the World Assembly". World Council for the Welfare of the Blind. 1969. Retrieved 14 June 2015.
  4. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.