ఖగోళ గడియారం (ప్రేగ్)
ఖగోళ గడియారం లేదా ప్రేగ్ ఓర్లోజ్ అనేది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని ఓల్డ్ టౌన్ హాల్‌కు అనుసంధానించబడిన మధ్యయుగ ఖగోళ గడియారం. ఈ గడియారం 1410లో మొదటిసారిగా స్థాపించబడింది, ఇది ప్రపంచంలోనే మూడవ పురాతన ఖగోళ గడియారం, ఇప్పటికీ నడుస్తున్న పురాతన గడియారం.[1]
వివరణ
మార్చుఓల్డ్ టౌన్ స్క్వేర్‌లోని ఓల్డ్ టౌన్ హాల్ దక్షిణ గోడపై ఈ గడియారం స్థాపించబడింది. ఈ గడియారం ఖగోళ, ఆకాశంలో సూర్యుడు, చంద్రుల స్థానాన్ని సూచిస్తుంది, వివిధ ఖగోళ వివరాలను చూపుతుంది. వివిధ కాథలిక్ సాధువుల విగ్రహాలు గడియారానికి ఇరువైపులా ఉన్నాయి. స్థానిక పురాణం ప్రకారం, గడియారాన్ని నిర్లక్ష్యం చేస్తే నగరం ప్రమాదంలో పడుతుంది. ఎప్పుడైతే నగరం ప్రమాదంలో ఉంటుందో దానిని పురాణాల ప్రకారం, నూతన సంవత్సరం రోజు రాత్రి జన్మించిన బాలుడు మాత్రమే రక్షించగలడు.[2]
చరిత్ర
మార్చుఈ గడియారాన్ని కడన్‌కు చెందిన క్లాక్‌మేకర్ మికులాస్, చార్లెస్ యూనివర్సిటీ గణిత, ఖగోళశాస్త్ర ప్రొఫెసర్ జాన్ షిండెల్ రూపొందించారు.[3] 1490లో గడియారం పనిచేయనప్పుడు ప్రేగ్ కౌన్సిలర్ల ఆదేశంతో గడియార తయారీదారుడు హనుష్ దానిని బాగు చేయడానికి ప్రయత్నించాడు. కానీ దానిని బాగు చేయలేకపోయాడు, అతను గడియారాన్ని నడవకుండా నిలిపివేశాడు, 1552 సంవత్సరం వరకు ఎవరూ దానిని మరమత్తు చేయలేకపోయారు. 1552లో దీనిని క్లోకోట్‌స్కా హోరా మాస్టర్ క్లాక్‌మేకర్ జాన్ టాబోర్స్కీ (1500–1572) మరమ్మత్తు చేసాడు, 1552 తర్వాత గడియారం చాలాసార్లు పనిచేయడం మానేసింది, చాలాసార్లు మరమత్తులకు గురైంది. ఈ గడియారం చుట్టూ 1629 లేదా 1659లో చెక్క విగ్రహాలు అమర్చారు, 1787-1791 సంవత్సరాలలో మరమత్తు తర్వాత అపొస్తలుల బొమ్మలు కూడ అమర్చారు. 1865-1866 సంవత్సరాలలో మరమత్తు తర్వాత ఒక క్రోయింగ్ రూస్టర్ బంగారు బొమ్మను అమర్చారు. ప్రేగ్ తిరుగుబాటు సమయంలో ముఖ్యంగా 8 మే 1945న నాజీలు జరిపిన కాల్పుల్లో గడియారంలోని చెక్క శిల్పాలు, జోసెఫ్ మానెస్ రూపొందించిన క్యాలెండర్ డయల్ ఫేస్ పాడయ్యాయి.[4] 1948లో వోజ్టేచ్ సుచర్దా అనే అతను గడియారాన్ని బాగు చేసాడు.
605వ వార్షికోత్సవం
మార్చుఈ గడియారం 605వ వార్షికోత్సవం సందర్భంగా, 9 అక్టోబర్ 2015న, గూగుల్ హోమ్ పేజీలోని గూగుల్ డూడుల్ లో కనిపించింది.[5]
2018 పునర్నిర్మాణం
మార్చుగడియారాన్ని పునర్నిర్మాణం కోసం తీసివేసి 2018 ప్రారంభంలో దానిలో ఎల్ఈడి స్క్రీన్ ను అమర్చారు, [6]పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాక, దీనిని 28 సెప్టెంబర్ 2018న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు తిరిగి ప్రారంభించారు.
మూలాలు
మార్చు- ↑ Oppelt, MF DNES, Robert (2007-10-01). "Jeho prapradědeček oživil orloj, on v tradici pokračuje". iDNES.cz. Retrieved 2023-06-20.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Prague City Line » Legends of the Old Town Astronomical Clock". Retrieved 2023-06-20.
- ↑ "Pražský orloj - The Prague Astronomical Clock -". www.orloj.eu. Retrieved 2023-06-20.
- ↑ "Pražský orloj - The Prague Astronomical Clock". www.orloj.eu. Retrieved 2023-06-20.
- ↑ "Google Doodle: Prague's astronomical clock is 605 years old, but what makes it tick?". www.telegraph.co.uk. Retrieved 2023-06-20.
- ↑ Nuc, Jan (2018-03-15). "Orloj na pražské Staroměstské radnici nahradila digitální obrazovka". iDNES.cz. Retrieved 2023-06-20.