ఖాజిగుండ్
ఖాజిగుండ్ భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, అనంతనాగ్ జిల్లాలోని పట్టణం. ఖాజిగుండ్ పట్టణం సముద్ర మట్టానికి 1670 మీటర్ల (5478 అడుగులు) ఎత్తులో హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో 33.59°N అక్షాంశం, 75.16°E రేఖాంశం వద్ద ఉంది. దీనిని కాశ్మీర్ గేట్‌వే అని కూడా పిలుస్తారు.[3][4]
ఖాజిగుండ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 33°35′32″N 75°09′56″E / 33.592132°N 75.165432°E | |
దేశం | భారతదేశం ( India) |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | అనంతనాగ్ జిల్లా |
Government | |
• Body | మున్సిపల్ కార్పోరేషన్ |
Elevation | 1,670 మీ (5,480 అ.) |
జనాభా (2011) | |
• Total | 9,871 |
భాషలు | |
• అధికారిక భాషలు | కాశ్మీరి, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్[1][2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | JK 03 |
స్థానం
మార్చుఖాజిగుండ్ పట్టణం, అనంతనాగ్ నుండి 21 కి.మీ, శ్రీనగర్ నుండి 72 కి.మీ,[5] జమ్మూ నుండి 187 కి.మీ. దూరంలో ఉంది. ఖాజిగుండ్ బైపాస్ దల్వాచ్, చిముల్లా & షాంపోరా గ్రామాల మీదుగా ఉంది. ఖాజిగుండ్ చుట్టూ నీటి బుగ్గలు ఉన్నాయి.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[6] ఖాజిగుండ్ మొత్తం జనాభా 9871. ఈ జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. ఖాజిగుండ్ సగటు అక్షరాస్యత రేటు 70.21%, జాతీయ సగటు 67.16% కంటే ఎక్కువ, పురుషుల అక్షరాస్యత 79.82%, స్త్రీల అక్షరాస్యత 58.27%. ఖాజిగుండ్ జనాభాలో 20.67% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.
వాతావరణం
మార్చుఖాజిగుండ్ లో సగటు అధిక ఉష్ణోగ్రత 3.8°C (38.8°F), సగటు తక్కువ ఉష్ణోగ్రత -5.4°C (22.3°F) ఉంటుంది. ఇక్కడ జనవరి నెలలో విపరీతమైన చలి ఉంటుంది.[7]
రవాణా
మార్చుఖాజిగుండ్, అనంతనాగ్, శ్రీనగర్‌లకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఖాజిగుండ్ నుండి శ్రీనగర్‌కు రోజుకు పది సార్లు రైలు సర్వీస్ ఉంది, ఇది కుల్గామ్‌కు రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. పీర్ పంజాల్ పర్వతంలోని ఖాజిగుండ్ టన్నెల్ గుండా వెళ్లే ఎన్హెచ్ 44 (పూర్వపు పేరు ఎన్హెచ్ 1ఏ) ద్వారా ఖాజిగుండ్, జమ్మూ, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.
ఖాజిగుండ్ రైల్వే సొరంగం
మార్చుఖాజిగుండ్ రైల్వే సొరంగం అనేది 11.2 కి.మీ పొడవు గల భారతదేశపు పొడవైన రైల్వే సొరంగం. ఇది భారతదేశంలోని ఏకైక బ్రాడ్ గేజ్ పర్వత రైల్వే సొరంగ మార్గం. ఇది భారతదేశం, జమ్మూ కాశ్మీర్‌లోని ఖాజిగుండ్, బారాముల్లా మధ్య ఉన్న పీర్ పంజాల్ పర్వత శ్రేణి గుండా విస్తరించి ఉంది. ఈ సొరంగ మార్గం భారతదేశంలోనే అతి పొడవైన,[8] ఆసియాలో మూడవ పొడవైన రైల్వే సొరంగం. దీని వలన ఖాజిగుండ్, బనిహాల్ మధ్య దూరం 11 కి.మీ తగ్గింది. ఈ దూరాన్ని అధిగమించడానికి కేవలం ఆరు నిమిషాల సమయం పడుతుంది.[9]
మూలాలు
మార్చు- ↑ "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
- ↑ "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 September 2020. Retrieved 23 September 2020.
- ↑ Kachru, Onkar (1998). Jammu, Kashmir, Ladakh: Ringside Views. Atlantic Publishers & Dist. ISBN 978-81-85495-51-4.
- ↑ "Explore The Gate Way Of Kashmir, Qazigund!". People Places. 2023-03-19. Retrieved 2023-07-26.
- ↑ "Distance between Qazigund and Srinagar is 61 KM / 37.9 miles". distancebetween2.com. Retrieved 2023-07-26.
- ↑ "Qazi Gund Municipal Committee City Population Census 2011-2023 | Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2023-07-26.
- ↑ Atlas, Weather. "Qazigund, India - Yearly & Monthly weather forecast". Weather Atlas. Retrieved 2023-07-26.
- ↑ "India's longest railway tunnel unveiled in Jammu & Kashmir - Times Of India". web.archive.org. 2013-06-29. Archived from the original on 2013-06-29. Retrieved 2023-07-26.
- ↑ "Indian Railways makes history, runs train through Asia's second longest tunnel". India Today. Retrieved 2023-07-26.