గంజరబోయినవారిపాలెం

గంజరబోయినపాలెం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం బలుసులవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామ దేవత శ్రీ శంకరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలుపులు, 2015,మే-20వ తేదీ బుధవారం నుండి, 24వతేదీ ఆదివారం వరకు, వైభవంగా నిర్వహించారు. ఐదవరోజైన ఆదివారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. జలధిలో నుండి అమ్మవారిని బయటకుతీసి, గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రవేశం అనంతరం, భక్తులు, అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించి, పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేసినారు.