గజానన్ మహారాజ్
గజానన్ మహారాజ్(Gajanan Maharaj) భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఇతడిని శివుని అవతారంగా భావిస్తారు. అతను ఎప్పుడు పుట్టాడో, ఎక్కడి నుంచి షెగావ్ వచ్చాడో ఎవరికీ తెలియదు.మొదటి సారిగా 1878 ఫిబ్రవరి 23 న మహారాష్ట్ర లోని షెగావ్ లో కనిపించాడు. బంకత్ లాల్, దామోదర్ అనే వ్యక్తులు గజానన్ మహారాజ్ ను చూసినవారు. గజానన్ మహారాజ్ ఆహార ప్లేట్ల లో మిగిలిపోయిన ఆహారాన్ని తీస్తున్నట్లు వారు చూడటం, పశువుల కోసం ఉంచిన సాధారణ నీటిని తాగడాం వేరు చూసారు. వీరి భావనలో ఒక సాధారణ వ్యక్తి ఇలాంటివి చేయలేరని, అతను ఒక సాధువు కావచ్చు అని అనుకున్నారు[1].
దస్త్రం:Gajanan.png | |
జననం | తెలియదు [a] [[షేగాన్ ]] |
---|---|
మరణం | సెప్టెంబర్ 8, 1910 షేగాన్ , మహారాష్ట్ర, భారతదేశం |
చరిత్ర
మార్చుగజానన్ మహారాజ్ గా ప్రసిద్ధి చెందిన ఈ అవధూత ప్రారంభ జీవితం గురించి ఎటువంటి ప్రామాణిక సమాచారం లేదు. కొంతమంది మహారాష్ట్రలోని సజ్జన్ గఢ్ అనే ప్రదేశంలో జన్మించారని ఊహాగానాలు చేస్తున్నప్పటికీ ఆయన పుట్టిన ప్రదేశం, పుట్టిన తేదీ, తల్లితండ్రులు మొదలైనవి ఎవ్వరికీ తెలియదు. గజానన్ మహారాజ్ తన గతాన్ని వెల్లడించలేదు. షెగావ్ లో మొదటిసారి కనిపించిన వెంటనే, అతను ఎక్కడ నుండి వచ్చాడో, అతని వంశం ఏమిటో ఎవరికీ తెలియదు కాబట్టి, ప్రజలు అతన్ని ఏమి పిలవాలో ఆలోచించారు. ఆయన ఎల్లప్పుడు "గణగణ గణత్ బోటే" అనే మంత్రాన్ని జపించడంతో ప్రజలు ఆయనను శ్రీ గజానన్ మహారాజ్ గా పిలవడం ప్రారంభించారు. ప్రజలు అతనికి ఖరీదైన బట్టలు, ఆభరణాలు, డబ్బు, ఆహారాన్ని ఇచ్చినా ఎల్లప్పుడూ వాటిని అదే ప్రదేశంలోనే వదిలేసేవాడు, ఎప్పుడూ తన వెంట ఏదీ తీసుకెళ్లేవాడు కాదు. గజానన్ మహారాజ్ చాలాసార్లు దిగంబరునిగా, అవధూతలా( అంటే అన్ని ఇంద్రియాలను జయించిన వారు) వాటిని మించిన స్థితికి చేరుకున్నాడు. ఏదైనా తినేవాడు, ఎక్కడైనా పడుకునేవాడు, ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళేవాడు.[2]
లోకమాన్య తిలక్ కు సన్నిహితుడైన దాదాసాహెబ్ ఖపర్డే ప్రకారం, గజానన్ మహారాజ్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పండిత బ్రాహ్మణుడు, వైదిక గ్రంథాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడని, తెలుగు భాషలో లో మాట్లాడటం కొందరు విన్నారని పేర్కొంటారు. చాలా మంది తెలిపిన ప్రకారం గజానన్ మహరాజ్ చాలా అరుదుగా మాట్లాడేవాడని, ప్రజలు వెంటనే మాట్లాడలేని, లేదా అర్థం చేసుకోలేని నిగూఢమైన వ్యాఖ్యలు చేసేవారని పేర్కొన్నారు. .
11 లేదా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు గజానన్ మహారాజ్ ఇంటి నుండి పారిపోయాడని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భవానీరామ్, షాహుబాయి అనే దంపతులకు జన్మించాడని, రచయిత సుమన్బంధు తన పుస్తకం "శేగవిచా సావ్లా దేవా"లో మహారాజ్ పుట్టుకను పరిశీలించే ప్రయత్నం చేశాడు. ఖమ్గావ్ లోని ఒక మూలం ప్రకారం, పెథారే, మహారాజ్ లట్కర్ వంశానికి, గార్గ్య గోత్రానికి చెందిన దేశస్థ బ్రాహ్మణుల కుటుంబానికి చెందినవాడని మహారాజ్ గోఖలేల కుటుంబానికి చెందినవాడని నాగపూర్ కు చెందిన మరో పండితుడు అప్రబుద్ధ పేర్కొన్నాడు.[3]
ట్రస్ట్
మార్చుగజానన్ మహారాజ్ షెగావ్ జీవించిన సమయంలో ప్రజలకు అనేక అద్భుతాలను చూపించాడు, వాటిలో ఎక్కువ భాగం సమాజానికి ఉపయోగమైనవి. గజానన్ మహారాజ్ స్పర్శతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి స్వస్థత చేకూరడం, ప్రజలలో భయంకరమైన వ్యాధులు చాలా వరకు అంతమయ్యాయి. గజానన్ మహారాజ్ ను సాధువుగా భావించిన బంకత్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి తనతో ఉండమని కోరాడు. జన్రావ్ దేశ్ ముఖ్ అనే వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం, నిప్పు లేకుండా మట్టి పైపును వెలిగించడం, ఎండిపోయిన బావిని నీటితో నింపడం, చేతులతో చెరకును తిప్పడం ద్వారా చెరకు రసం గీయడం, ఒక మహిళ కుష్టువ్యాధిని నయం చేయడం వంటి ఎన్నో అద్భుతాలను ఆయన తన జీవితకాలంలో చేశారని భక్తులు పేర్కొంటారు.[4] గజానన్ మహారాజ్ భక్తులు ఇప్పటికీ తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో అద్భుతాలను అనుభవిస్తున్నారు. 1910 సెప్టెంబరు 8న ఆయన సమాధి అయ్యారు. గజానన్ మహారాజ్ ఆలయ నిర్వహణకు ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతములో ఉన్న నీటి సమస్యలను పరిష్కరించడానికి గజానన్ మహారాజ్ మందిర్ ట్రస్ట్ ఆనంద్ సాగర్ ను నిర్మించింది. ట్రస్ట్ ఆధ్యాత్మికత కలయికతో ఒక సరస్సును, దాని పరిసర ప్రాంతాన్నిభక్తుల విరాళాలతో పార్కును అభివృద్ధి చేస్తున్నారు[1].
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Gajanan Maharaj Mandir Alandi Must See Most Beautiful Gajanan Maharaj Temple During Alandi Darshan in 2021 » travfoodie". travfoodie.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-15. Retrieved 2023-01-25.
- ↑ "Gajanan Maharaj". My Dattatreya (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-25.
- ↑ "About Maharaj". www.gajanan-shegaon.com. Archived from the original on 2023-03-25. Retrieved 2023-01-25.
- ↑ "Great Saints of India". GREAT GURUS OF INDIA (in ఇంగ్లీష్). Retrieved 2023-01-25.
- ↑ Date of first appearance: February 23, 1878.