గడ్డెన్న వాగు
గడ్డెన్న వాగు నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి 2 కి.మీ. దూరంలో సుద్దవాగుపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు. సుద్దవాగు, గోదావరి నదిలో కలిసే ఉపనదం. నిర్మల్ జిల్లా లోని లోకేశ్వరం, భైంసా, ముధోల్ మండలాల్లోని 20 గ్రామాల్లో 14 వేల ఎకరాల్లో సాగునీరుతోపాటు భైంసా నగర పంచాయతీలో తాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు నిర్మించారు.[2][3]
గడ్డెన్న వాగు | |
---|---|
అధికార నామం | గడ్డెన్న వాగు |
దేశం | భారత దేశం |
ప్రదేశం | భైంసా |
ఆవశ్యకత | సాగు నీరు |
స్థితి | పని చేస్తోంది |
నిర్మాణం ప్రారంభం | 2000 |
ప్రారంభ తేదీ | 2006 |
నిర్మాణ వ్యయం | 20.33 కోట్లు |
యజమాని | తెలంగాణ రాష్ట్రం |
నిర్వాహకులు | తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | సుద్దవాగు |
Elevation at crest | 350.7 మీ.[1] |
జలాశయం | |
పరీవాహక ప్రాంతం | 21.834 చ.కి.మీ |
సాధారణ ఎత్తు | 358.7 మీ. |
20.33 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలై, 2006 లో పూర్తైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు.[4]
మూలాలు
మార్చు- ↑ "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ గడ్డెన్న వాగు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
- ↑ "కడెం ప్రాజెక్టు వరద గేటు ఎత్తివేత". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-09. Retrieved 2020-05-11.