గమనశ్రమ రాగము
గమనశ్రమ రాగము కర్ణాటక సంగీతంలో 53వ మేళకర్త రాగము.[1] [2].
రాగ లక్షణాలు
మార్చుఆరోహణ : స రి గ మ ప ధ ని స (S R1 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స (S N3 D2 P M2 G3 R1 S)
ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.
ఇది 17 మేళకర్త రాగమైన సూర్యకాంతం యొక్క ప్రతి మధ్యమ సమానము.
గమనశ్రమ జన్యరాగాలు
మార్చుగమనశ్రమ లో కొద్ది జన్య రాగాలు ఉన్నవి. వానిలో హంసనందిని, పూరీకళ్యాణి ముఖ్యమైనవి.
పూరీకళ్యాణి రాగము
మార్చు- ఉదాహరణలు
- ఓ రామ నీ నామ మేమి రుచిరా - రామదాసు కీర్తన.
- ఆనంద మానందమాయెను - రామదాసు కీర్తన.
- నీ సంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా - రామదాసు కీర్తన.
- మైసూర్ వాసుదేవాచార్ రచించిన ఈడు నీకు న్యాయం
- వీణే శేషన్న రచించిన ఉభయ కావేరి
- కోటీశ్వర అయ్యర్ రచించిన ఇహమే సుఖము
- ఎన్ని మారులు నే విన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ