గసగసాలు , poppy seeds

మార్చు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

గసగాసాల తో వైద్యము , Poppy seeds and health :

మార్చు

ఓపియం (నల్లమందు మొక్క ) శాస్త్రీయ నామము ఓపియం పోపీ, పెపావర్ సోమ్నిఫెరమ్‌ (opium poppy, papave somniferum) . దీని నుండి ఓపియం (నల్లమందు ), గసగసాలు ఉపయోగకరమైనవి . నల్లమందును పచ్చికాయకు గంటు పెట్టి ... కారే పాల నుండి తయారు చేస్తారు . గింజలు (గసగసాలు) తీసివేసిన ఎండిన తొక్కలనుండి అనేక రకాల ఓపియేట్స్ - మారకద్రవ్యాలు, మందులు ఉదా: మార్ఫిన్‌ (morphine), తెబైన్‌ (thebaine), కొడిన్ (codine) ‌ ఒరిపావిన్‌ (oripavine) వంటివి తయారు చేస్తారు . గింజలు (గసగసాలు ) లో ఓపియం పదార్థం (Opium content) చాలా తక్కువగా ఉంటుంది ... కావున ఆహారపదార్ధముగా వాడుతారు . గససాలు, గసగసాల నూనెను ఫుడ్ ప్రొడక్ట్స్ గా వ్యాపార శైలిలో వాడుతారు . గసగసాల ఉపయోగాలు చూద్దాం : వీర్యస్తంబనకు పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి, అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంబన కలుగుతుంది. దేహమునకు చలువ చేయుటకు 10gm గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ వుంటే ఉష్ణ శరీరం కలవారు అధిక వేడి తగ్గి దేహం చలువ చేస్తుంది . చుండ్రుకు-వెండ్రుకలు పెరుగుటకు గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మేతగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ వుంటే తలలో కురుపులు చుండ్రు తగ్గి పోయి వెండ్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి . శిరోవాతమునకు గసగసాలు 10gm, యాలకులు 10gm, సోంపు గింజలు 10gm .ఈ పదార్ధాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 60gm ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగే నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి దించి వడపోసి నిలువ ఉంచుకుని దీనిని రోజు తలకు రాసుకుంటూ వుంటే తల దిమ్ము, తల నొప్పి, పార్శ్వపు నొప్పి హరించి పోయి మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా వుంటుంది. గర్బినీల రక్త జిగట విరేచనాలు గసగసాలు 10gm లు, పటిక బెల్లం 20gm కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని, పూటకు 5gm పొడిని 20 gm వేన్నలో కలుపుకుని రోజు 2 లేదా 3 పూటలు తింటూ వుంటే గర్బినీలకు కలిగే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవును. అన్నంలో పెరుగు కలుపుకుని తినవలెను. జిగట విరేచనాలు గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటలా పూటకు 5 gm నుండి 10 GM మోతాదుగా అన్నంలో కలిపి తింటూ వుంటే 2 లేక 3 రోజుల్లో జిగట విరేచనాలు తగ్గిపోతాయి. నిద్ర రాకపోతే వేడి చేసిన గసగసాలు మూట గట్టి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే నిద్ర వస్తుంది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గసగసాలు&oldid=2885086" నుండి వెలికితీశారు