గాంగేయభూషిణి రాగం

గాంగేయభూషణి రాగము కర్ణాటక సంగీతం లో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 33 వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగం పేరు "గంగాతరంగిణి". [1][2][3]

Gangeyabhushani
ఆరోహణS R₃ G₃ M₁ P D₁ N₃ 
అవరోహణ N₃ D₁ P M₁ G₃ R₃ S
గాంగేయభూషణి scale with shadjam at C

రాగ లక్షణాలు సవరించు

ఆరోహణ: స రి గ మ ప ధ ని స
S R3 G3 M1 P D1 N3 S
అవరోహణ: స ని ధ ప మ గ రి స
S N3 D1 P M1 G3 R3 S


ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 69 వ మేళకర్త రాగమైన ధాతువర్ధని రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు సవరించు

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • అలేరుకుమచౌలద్ధేమ - ఝంప - వెంకటమఖి
  • వరదరాజు అవావా - తిస్రేక - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచరి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
  • సులభ పోజేయ మాది - పురందరదాసు
  • ఎవ్వరే రామయ్య - త్యాగరాజు

మూలాలు సవరించు

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras

బాహ్య లంకెలు సవరించు

  • "Learn Indian Classical Melakartha Ragas | Ruthu Chakram - 33 Gangeya Bhushani - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
  • "Evvare ramayya - Gangeyabhushani - Sanjay Subrahmanyan Live - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.