గాంధీ ఆశ్రమ ట్రస్టు

గాంధీ ఆశ్రమ ట్రస్ట్ (GAT) గాంధేయవాద తత్వంతో 1946 నుండి గ్రామీణ అభివృద్ధి కోసం నోఖాలీలో స్థాపించబడిన దాతృత్వ సంస్థ. దీనిని అంబిక-కలిగంగ ఛారిటబుల్ ట్రస్ట్ అని కూడా పిలుస్తారు. [1]

1947 లో మహాత్మాగాంధీ నోఖలి సందర్శన స్ఫూర్తితో గ్రామీణ అభివృద్ధి, శాంతి, సామాజిక సామరస్యం అనే గాంధేయ తత్వాన్ని అవలంబిస్తూ ఆ ప్రాంతంలో గ్రామీణ పేదలు, ముఖ్యంగా మహిళల గూర్చి, పేద ప్రజల జీవన పరిస్థితులను పెంచడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఇది అభివృద్ధి, ధార్మిక కార్యకలాపాలకోసం పాటుపడుతుంది.

ప్రారంభంలో ఈ ప్రాంగణానిని వాస్తవ యజమాని (బారిస్టర్ హేమంత కుమార్ ఘోష్) స్థాపించబడి, తరువాత జి.ఎ.టి కి బహుమతిగా యివ్వబడినది. అంబికా కళింగంగ ఛారిటబుల్ ట్రస్టు ఇచట ధార్మిక కార్యకలాపాలను నిర్వహించింది. అది 1946 అల్లర్ల బాధితుల సహాయం కోసం పనిచేసింది. పాకిస్తాన్ పాలనలో, అప్పటి ప్రభుత్వ విధానాల కారణంగా ట్రస్ట్ తన కార్యకలాపాలను కొనసాగించలేకపోయింది.

1971 లో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1975 లో గాంధీ ఆశ్రమ ట్రస్ట్ ఆవిర్భవించబడింది. దీని తరువాత ట్రస్ట్ దృష్టి, మిషన్‌లో మార్పు వచ్చింది. పేదలు, వెనుకబడిన వారి అభివృద్ధి కోసం సేవలు స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు తీసుకోబడ్డాయి. ప్రస్తుతం, గాంధీ ఆశ్రమ ట్రస్ట్ ప్రధాన దృష్టి భౌతిక, శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాల అభివృద్ధి చేయడం.

ఇది బంగ్లాదేశ్ దక్షిణ భాగంలోని 5 జిల్లాలలో పనిచేస్తోంది. శాంతి ని నెలకొల్పడం, మానవ అభివృద్ధి, మానవ హక్కులు, మంచి పాలన, హస్తకళల అభివృద్ధి, విద్యాభివృద్ధి మొదలైనవి కార్యక్రమాలు ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలు.

మూలాలు

మార్చు
  1. Bhuiyan, Sultan Mahmud (2012). "Gandhi Ashram". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.