గాలిమర

గాలి మర (ఆంగ్లం Wind Mill) అనునది విద్యుత్తుని తయారుచేసే యంత్రము. దీనిని 'విండ్ టర్బైన్' అని కూడా అంటారు. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. గాలి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడంవల్ల దీనిలోని జెనరేటర్ తిరుగుతుంది. జెనరేటర్ తిరగడం వల్ల విద్యుత్తు పుడుతుంది. ఈ విద్యుత్తు మొదట బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఆ తరువాత ఈ విద్యుత్తుని ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఆంప్లిఫై చేసి గ్రిడ్ కి తరలిస్తారు. ఇలా ఉత్పత్తిచేసిన విద్యుత్తును పవన విద్యుత్తు అంటారు.

చరిత్రసవరించు

మొట్టమొదటగా గాలిమరలను తొమ్మిదవ శతాబ్దంలో పర్షియా కు చెందిన శాస్త్రవేత్తలు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. [1][2]

మూలాలుసవరించు

  1. "دانره المعارف بزرگ اسلامی - اصطخري‌، ابواسحاق‌". మూలం నుండి 2012-06-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-07-01. Cite web requires |website= (help)
  2. Ahmad Y Hassan, Donald Routledge Hill (1986). Islamic Technology: An illustrated history, p. 54. Cambridge University Press. ISBN 0-521-42239-6.
"https://te.wikipedia.org/w/index.php?title=గాలి_మర&oldid=2801580" నుండి వెలికితీశారు