పోతురాజు

గ్రామ దేవతలకు తమ్ముడు
(గావు పెట్టడం నుండి దారిమార్పు చెందింది)

పోతరాజు లేదా పోతురాజు pōtu-rāju. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల తమ్ముడిగా పూజలు అందుకునేవాడు. "పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు" అనేది తెలుగు సామెత. in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.)

హర్యానాలో జరిగిన ప్రతిష్టాత్మక సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో తెలంగాణ కళారూపాల కళాయాత్రలో పోతరాజు కళాకారుడు
బతుకమ్మ పండగ సందర్భముగా.. వనస్థలిపురములో పోతురాజుల వేష ధారులు

పోతురాజు లేకుండా ఏ కొలుపు, ఏ జాతర, ఏ తిరునాళ్లు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైనవాడు ఈ పోతురాజు.[1] మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు.[2]

గ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో వున్న పోతరాజు తన దంతాలతో మేక పోతును కొరికి, తలను మోండెం నుండి వేరుచేసి పైకి ఎగురవేస్తాడు, దీనినే గావు పెట్టడం అంటారు. గ్రామ దేవతల ఊరేగింపులో ముందుగా పోతు రాజు విగ్రహము ముందుంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతు రాజు వేషం ధరించి ఆడుతారు. అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసే టప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెట్టి నాటకము ఆడుతారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (13 July 2019). "'అమ్మ దేవతల' తమ్ముడు మన పోతురాజు". ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి. Archived from the original on 14 July 2019. Retrieved 14 July 2019.
  2. మనతెలంగాణ, లైఫ్ స్టైల్ (14 July 2019). "నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు". Archived from the original on 14 July 2019. Retrieved 14 July 2019.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పోతురాజు&oldid=4353563" నుండి వెలికితీశారు