గిరిరాజ్ సింగ్

భారత రాజకీయ నాయకుడు

గిరిరాజ్ సింగ్ (జననం 1952 సెప్టెంబరు 8) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  ఇతను బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

గిరిరాజ్ సింగ్
గిరిరాజ్ సింగ్
కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ శాఖ మంత్రి
Assumed office
2021 జులై 7
ప్రథాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారునరేంద్ర సింగ్ తోమర్
వ్యక్తిగత వివరాలు
జననం (1952-09-08) 1952 సెప్టెంబరు 8 (వయసు 71)
బీహార్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిఉమా సిన్హా
సంతానం1

తొలినాళ్ళ జీవితం మార్చు

గిరిరాజ్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లా బర్హియ పట్టణంలోరామత్వార్ సింగ్ తార దేవి దంపతులకు జన్మించాడు. ఇతను 1971లో మగధ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఇతనికి ఉమా సిన్హాతో వివాహమైంది, వీరికి ఒక కుమార్తె.[2]

రాజకీయ జీవితం మార్చు

సింగ్ బీహార్ ప్రభుత్వంలో 2005 నుండి 2010 వరకు సహకార మంత్రిగా, 2010 నుండి 2013 వరకు పశుసంవర్ధక మంత్రిగా పనిచేశాడు. ఇతను మొదటి నుండి నరేంద్ర మోడీకి బలమైన మద్దతుదారుడుగా ఉన్నాడు.[3][4]

2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఓడించిన తరువాత, 2019 మేలో కొత్తగా ఏర్పడిన పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య మంత్రిత్వ శాఖకు కేబినెట్ మంత్రి అయ్యాడు.

నరేంద్ర సింగ్ తోమర్ స్థానంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత 2021 జూలైలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రెండవ మోడీ మంత్రిత్వ శాఖలో పంచాయతీ రాజ్ మంత్రి అయ్యారు.[5][6]

చేపట్టిన పదవులు మార్చు

  • 2002 - 2014: బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు.
  • 2005 - 2010: సహకార మంత్రి, బీహార్ ప్రభుత్వం.
  • 2010 - 2013: క్యాబినెట్ మంత్రి, పశుసంవర్ధక, మత్స్య వనరుల అభివృద్ధి, బీహార్ ప్రభుత్వం.
  • 2014: 16 వ లోక్‌సభ సభ్యుడు.
  • 2014 నవంబరు: కేంద్ర మంత్రి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ.
  • 2017 సెప్టెంబరు : కేంద్ర మంత్రి (స్వతంత్ర ఛార్జ్) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ.
  • 2019 మే: పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య మంత్రిత్వ శాఖ మంత్రి క్యాబినెట్ మంత్రి.[7]

మూలాలు మార్చు

  1. "Giriraj Singh". National Portal of India. Government of India. Retrieved 5 October 2019. Father's Name: Shri Ramavtar Singh Mother's Name: Late Smt. Tara Devi
  2. Singh, Abhay (11 January 2014). "State BJP forms 16-member election panel". The Times of India. Archived from the original on 15 January 2014. Retrieved 28 January 2014.
  3. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019
  4. "BJP's Giriraj Singh Beats Kanhaiya Kumar By 4 Lakh Votes in Begusarai". NDTV.com. 24 May 2019. Retrieved 23 September 2019.
  5. PTI (24 October 2016). "Union Minister Giriraj Singh Urges Hindus To 'Increase Their Population'". NDTV. Retrieved 3 November 2016.
  6. IANS (24 October 2016). "Union Minister Giriraj Singh urges Hindus should to increase their population". Firstpost. Retrieved 3 November 2016.
  7. "Outspoken Giriraj Singh to Take Charge as Minister of Animal Husbandry, Dairying, and Fisheries". News18. 31 May 2019. Retrieved 31 May 2019.