గిసెలె బండ్చెన్
గిసెలె బండ్చెన్ బ్రెజిల్ దేశానికి చెందిన ఒక సూపర్ మోడల్. 2016 ఒలింపిక్స్ ప్రారంభవేడుకలలో ఈవిడ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గిసెలె బండ్చెన్ (Gisele Bündchen) | |
---|---|
జననం | గిసెలె కరోలిన్ బండ్చెన్ (Gisele Caroline Bündchen)[1] 1980 జూలై 20 ట్రెస్ ది మయో, రియో గ్రాండ్ దొ సల్, బ్రెజిల్ |
వృత్తి |
|
ఎత్తు | 1.80 మీ. (5 అ. 11 అం.)[2] |
కేశాల రంగు |
|
కళ్ళ రంగు | |
కొలతలు | 34B-26-36 (89-66-91)[2] |
దుస్తుల కొలత | 6 US[3] |
చెప్పుల సైజు | 38-39 EU, 8 US, 6 UK[2] |
Manager | IMG మోడల్స్ |
భార్య/భర్త | |
పిల్లలు | 2 |
విశేశాలు
మార్చుఅందగత్తె.. అత్యధిక సంపాదనపరురాలు.. ఎక్కువకాలం కొనసాగిన సూపర్‌మోడల్.. బ్రెజిల్ భామ గిసెలె బండ్చెన్ గురించి ఇప్పుడు ఎంతైనా చెప్పొచ్చు. అంతకుముందు ఈవిడ కథే వేరు. పూట గడవడానికి పద్నాలుగేళ్లకే కొలువు చేసింది. మోడలింగ్‌కి పనికిరావంటూ ఛీత్కరింపులు ఎదుర్కొంది. ఇలాంటివెన్నో. ఫోర్బ్స్ జాబితాలో మేటిగా నిలిచిన ఆమె సంగతులివి. [5]
- ఆరుగురు అక్కాచెల్లెళ్లున్న కుటుంబంలో పుట్టింది. కుటుంబ భారం మోయడానికి పద్నాలుగేళ్లపుడే వెయిటర్‌గా, మాల్ ఉద్యోగిగా మారింది.
- వాలీబాల్ క్రీడాకారిణి కావాలని గిసెలె ఆశ. కానీ అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఓ మాల్‌లో షాపింగ్ చేస్తుండగా ఎలైట్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్లు మోడలింగ్‌కి రమ్మని ఆహ్వానించారు.
- ఇంగ్లిష్ రాదు.. తొలి క్యాట్‌వాక్‌నే కిందపడిపోయింది. అందంగా లేవంటూ కామెంట్లు.. మొదట్లో చాలానే భరించింది. 42 ఆడిషన్లకు వెళ్లినా మోడల్‌గా ఎంపిక కాలేదు. అవకాశాల కోసం బ్రెజిల్ నుంచి లండన్‌కి మకాం మార్చింది. ‘నీ కళ్లు చిన్నగా ఉన్నాయి. ముక్కు మరీ పొడుగ్గా ఉందంటూ అక్కడా అవమానాలే ఎదుర్కొంది.
- ఎలాగోలా కష్టపడి చిన్నచిన్న అవకాశాలు చేజిక్కించుకుంది. 1998లో బండ్చెన్ ఫొటో వోగ్ పత్రిక ముఖచిత్రంపై మెరవడంతో తన దశ తిరిగింది. అవకాశాలు వరుసకట్టాయి. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియాతో ప్రేమాయణం సైతం కలిసొచ్చింది.
- సూపర్‌ఫామ్‌లో ఉన్నపుడు ఈ భామ సృష్టించిన సంచలనాలు ఎక్కువే. 2007లో లోదుస్తుల తయారీ సంస్థ విక్టోరియాతో కనీవినీ ఎరుగని భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదిలో ఇరవైకిపైగా మేగజైన్ల కవర్‌పేజీలకు పోజులిచ్చింది. ఫ్యాషన్ చరిత్రలోనే అత్యంత విలువైన వందకోట్ల విలువైన రెడ్ హాట్ బ్రా ధరించింది.
- సూపర్‌మోడల్ అయ్యాక మోకాళ్లను పైకి ఎత్తి పాదాలను గాల్లోకి తన్నే 'హార్స్ వాక్ ' అనే ట్రెండ్‌ని సృష్టించింది గిసెలెనే. ఇప్పటికి ఏడువేలకు పైగా మేగజైన్ల ముఖచిత్రంగా నిలిచింది. ఈమెకన్నా ముందుంది ప్రిన్సెస్ డయానా మాత్రమే.
- ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి రాయబారి.. అత్యంత శక్తివంతమైన మహిళల్లో నాలుగోస్థానం.. వరుసగా ఆరేళ్లు ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకున్న మోడల్.. ఏంజెలినా జోలీ, బియాన్స్ నోల్స్‌తో కలిసి సంయుక్తంగా అత్యధికులు కోరుకునే తారగా నిలవడం.. ఇవీ ఆమె ఘనతలే.
- అందం, సంపాదనలోనే కాదు దాతృత్వంలోనూ గిలెసె ముందే. బ్రెజిల్ జీరో హంగర్ ప్రోగ్రామ్, రెడ్‌క్రాస్ రిలీఫ్ ఫండ్, హైతీ భూకంప బాధితుల నిధి, ఆఫ్రికా ఎయిడ్స్ నిరోధక కార్యక్రమాలకు భూరి విరాళాలిచ్చింది.
మూలాలు
మార్చు- ↑ "In Childhood". Gisele Bundchen. Archived from the original on 6 జూలై 2011. Retrieved 3 సెప్టెంబరు 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 "IMG Models Portfolio - Gisele". Archived from the original on 22 డిసెంబరు 2015. Retrieved 6 December 2015.
- ↑ 3.0 3.1 IMG Models: Portfolio. IMG Models. Retrieved 25 January 2011
- ↑ (in Portuguese) Gisele, Musa of Hope
- ↑ " 42 వైఫల్యాల సూపర్ మోడల్ ". ఈనాడు. సెప్టెంబరు 3, 2016. Archived from the original on 2016-10-02. Retrieved సెప్టెంబరు 3, 2016.
బయటి లంకెలు
మార్చుWikimedia Commons has media related to: