గుంజి వెంకట రత్నం

కవి, విమర్శకుడు, నాటకకర్త, బహుగ్రంథకర్త.

గుంజి వెంకటరత్నం కవి, విమర్శకుడు, నాటకకర్త, బహుగ్రంథకర్త. అతను "హంసవింశతి" పై విశిష్టమైన కృషిచేసాడు. విజ్ఞానసర్వస్వాల నిర్మాణం వెంకటరత్నం గారి అభిమానాంశం. విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతుల గురించి ప్రత్యేక గ్రంథాలు రచించాడు. [1]

గుంజి వెంకటరత్నం
జననంవెంకట రత్నం
(1937-05-16) 1937 మే 16 (వయసు 86)
కలిచేడు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంవరంగల్
వృత్తితెలుగు లెక్చరర్
కవి,రచయిత
మతంహిందూ
భార్య / భర్తఆదిలక్మి
పిల్లలుగుంజి వెంకట శ్రీనివాస ప్రసాద్,గుంజి వెంకటశ్రీనివాసబాబు.
తండ్రిగుంజి వెంకటేశ్వర్లు
తల్లిగుంజి వెంకటలక్ష్మమ్మ.

జీవిత విశేషాలు మార్చు

గుంజి వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన కలిచేడులో వెంకటలక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు 1937 మే 16న జన్మించాడు. అతను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ, ఎం.లిట్‌., పిహెచ్‌.డి. డిగ్రీలను పూర్తి చేసాడు. హంసవింశతి - సమకాలీన జీవిత విధానం అనే అంశంపై ఎంలిట్ సిద్దాంత గ్రంథం సమర్పించాడు. అతను వరంగల్లు జిల్లా లోని సి.కె.ఎం. కళాశాలలో 1970 నుండి తెలుగు శాఖలో అధ్యాపకునిగానూ,రీడర్‌గాను, తెలుగు విభాగ శాఖాధ్యక్షులుగాను పనిచేసి 1995లో పదవీ విరమణ చేసాడు. తదనంతరం వరంగల్ జిల్లాలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని జానపద గిరిజన విజ్ఞానపీఠం లో 2009 నుండి 2011 వరకు రీసెర్చ్ ఫెలోగా పనిచేసాడు. 1996 లో కళాదీప్తి సాంస్కృతిక సంస్థ "విజ్ఞాన సర్వస్వనిధి" అనే బిరుదునిచ్చింది.

పరిశోధన,సంపాదకత్వం మార్చు

వెంకటరత్నం గారి పర్యవేక్షణలో పదిమంది పిహెచ్‌.డి డిగ్రీలు, ముగ్గురు యం.ఫిల్‌ డిగ్రీలు పొందారు.

రచనలు మార్చు

  1. హంసవింశతి - కావ్యస్వరూపం
  2. విజ్ఞాన సర్వస్వాలు - విశ్లేషణాత్మక అధ్యయనము
  3. తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు (తెలుగు అకాడమి ప్రచురణ)[2]
  4. విజ్ఞాన సర్వస్వాలు - వాటి నిర్మాణము( తెలుగు అకాడమి ముద్రణ)
  5. మహాభారతంలో ఇవి మీకు తెలుసా?(ఎమెస్కో ప్రచురణ2019)
  6. నా అమెరికా యానం(ఎమెస్కో ప్రచురణ2020)
  7. వ్యాస రత్నప్రభావళి(ఎమెస్కో ప్రచురణ2020)
  8. హంసవింశతి - విజ్ఞాన సర్వస్వం(మొదటి సంపుటం)
  9. హంసవింశతి - విజ్ఞాన సర్వస్వం(రెండవ సంపుటం)
  10. వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం (ప్రధాన సంపాదకుడు)[1]
  11. ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వం (తెలుగు అకాడమి హైదరాబాద్‌ ప్రచురణ)
  12. మహాభారతం - విజ్ఞాన సర్వస్వం, (మూడు సంపుటాలు యమెస్కో ప్రచురణ)

సంపాదకత్వం మార్చు

  1. తెలుగు నాటక రంగం - రచన - ప్రయోగం(సి.కె.యం.కళాశాల ప్రచురణ)
  2. పేర్వారం ఇంటర్వ్యులు
  3. ప్రసన్న శారద

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Rao, Gollapudi Srinivasa (2015-01-08). "Septuagenarian's priceless contribution to Warangal". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-14.
  2. గుంజి వెంకటరత్నం (2012). తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు. తెలుగు అకాడమీ. Retrieved 2022-01-21.
  3. ABN (2023-09-12). "23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.