ఘూర్జర లిపి
ఘూర్జర లిపి (ગુજરાતી લિપિ, లిప్యంతరీకరణ: గుజరాతీ లిపి) ఘూర్జరభాష, కఛ్భాష, అనేక ఇతర భాషలకు అబుగిద. భారతదేశ గణతంత్ర అధికారిక లిపుల్లో ఇది ఒకటి.
ఘూర్జర అక్షరాలూ అధిక చిహ్నాలూ సంఖ్యలూ
మార్చుఅచ్చులు
మార్చుఅచ్చులు (స్వర), సాధారణమైన క్రమంలో, కథాసరణిగా హ్రస్వ, దీర్ఘ తరగతులుగా సంగ్రహించుంటాయి, సాంప్రదాయ పద్యంలో అవి చేసే లఘు, గురు అక్షరాలు పట్టి. ఇదివరకటి ఈ, ఊ ల ఉచ్చారణ ఇప్పుడు దీర్ఘంగా ఉండదు. పద్యంలోనే వాటి తో ఉన్న అక్షరాలు ఛందస్సుకు అవసరమైన వర్ణాలు తీసుకుంటాయి.
చివరిగా, ఆంగ్లంలోని [æ], [ɔ] లను చూపిచ్చడానికి వక్రమైన మాత్రాల ప్రయోగం వాడుక పొందింది.
విడిగా | అధిక చిహ్నం | ભ | తెలుగులో సమానమైన అక్షరం | అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల | అధిక చిహ్న పేరు |
---|---|---|---|---|---|
અ | ભ | అ | ə | ||
આ | ા | ભા | ఆ | ɑ̈ | కానో |
ઇ | િ | ભિ | ఇ | i | హ్రస్వ-అజ్జు |
ઈ | ી | ભી | ఈ | దీర్ఘ-అజ్జు | |
ઉ | ુ | ભુ | ఉ | u | హ్రస్వ-వరరు |
ઊ | ૂ | ભૂ | ఊ | దీర్ఘ-వరరు | |
એ | ે | ભે | ఏ | ఏక్ మాత్ర | |
ઐ | ૈ | ભૈ | ఐ | əj | బే మాత్ర |
ઓ | ો | ભો | ఓ | కానో ఏక్ మాత్ర | |
ઔ | ૌ | ભૌ | ఔ | əʋ | కానో బే మాత్ర |
અં | ં | ભં | అం | ä | అనుస్వార్ |
અ: | ઃ | ભઃ | అః | ɨ | విసర్గ |
ઋ | ૃ | ભૃ | ఋ | ɾu | |
ઍ | ૅ | ભૅ | æ | ||
ઑ | ૉ | ભૉ | ɔ |
ર ర, જ జ, હ హ లు ఈ అక్రమ రూపాలు తీసుకుంటాయి: રૂ రూ, જી జీ, હૃ హృ.
హల్లులు
మార్చుహల్లులు (వ్యంజన) సాంప్రదాయ, భాషాశాస్త్రానికి తగిన సంస్కృత క్రమంలో సంగ్రహించుంటాయి. ఇందులో ఉచ్చారణనూ నాలుక స్థలాలనూ కంఠ్య, తాలవ్య, మూర్ధన్య, దంత్య, ఓష్ఠ్య, అంతస్థ, ఊష్మ వర్గాల ద్వారా ఆలోచనకు వస్తాయి. స్పర్శల వర్గాల్లో, వీట్లో మొదటి అయిదు, క్రమం అల్పప్రాణ శ్వాస తో మొదలెట్టి, మహాప్రాణ శ్వాస, అల్పప్రాణ నాద, మహాప్రాణ నాద లకు వెళ్ళి, అనునాసికలు చివ్వర్లో పెడ్తుంది. చాలావాటికి దేవనాగారిలో సమాన అక్షరాలున్నాయి.
స్పర్శ | అనునాసిక | అంతస్థ | ఊష్మ | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శ్వాస | నాద | ||||||||||||||||||||
అల్పప్రాణ | మహాప్రాణ | అల్పప్రాణ | మహాప్రాణ | ||||||||||||||||||
కంఠ్య | ક | క | kə | ખ | ఖ | kʰə | ગ | గ | ɡə | ઘ | ఘ | ɡʱə | ઙ | న | ŋə | ||||||
తాలవ్య | ચ | చ | tʃə | છ | ఛ | tʃʰə | જ | జ | dʒə | ઝ | ఝ | dʒʱə | ઞ | ఞ | ɲə | ય | య | jə | શ | శ | ʃə |
మూర్ధన్య | ટ | ట | ʈə | ઠ | ఠ | ʈʰə | ડ | డ | ɖə | ઢ | ఢ | ɖʱə | ણ | ఙ | ɳə | ર | ర | ɾə | ષ | ష | ʂə |
దంత్య | ત | త | t̪ə | થ | థ | t̪ʰə | દ | ద | d̪ə | ધ | ధ | d̪ʱə | ન | న | nə | લ | ల | lə | સ | స | sə |
ఓష్ఠ్య | પ | ప | pə | ફ | ఫ | pʰə | બ | బ | bə | ભ | భ | bʱə | મ | మ | mə | વ | వ | ʋə |
కంఠమూలీయ | હ | హ | ɦə |
---|---|---|---|
మూర్ధన్య | ળ | ళ | ɭə |
ક્ષ | క్ష | kʂə | |
જ્ઞ | జ్ఞ | ɡnə |
- అక్షరాల పేర్లు કાર కార్ ప్రత్యయం కలిపితే వస్తాయి. ર ర వేరు, దాని పేరు રેફ రేఫ్.
- ક క అని మొదలెట్టి જ્ઞ jña వరకు చూస్తే, క్రమం ఇలాగుంటుంది:
- స్పర్శలూ అనునాసికలూ (ఎడం నుండి కుడి వరకు, పై నుండి కింద వరకు) → అంతస్థలూ ఊష్మాలూ (పై నుండి కింద వరకు, ఎడం నుండి కింద వరకు) → రెండవ పట్టిక (పై నుండి కింద వరకు)
అచ్చులు కాని అధిక చిహ్నాలు
మార్చుఅధిక చిహ్నం | పేరు | తెలుగులో సమాన అధిక చిహ్నం |
---|---|---|
ં | అనుస్వార | ం |
ઃ | విసర్గ | ః |
્ | విరామ | ్ |
సంఖ్యలు
మార్చుహిందూ సంఖ్యలు | తెలుగు సంఖ్యలు | ఘూర్జర సంఖ్యలు | పేరు |
---|---|---|---|
0 | ౦ | ૦ | శూన్య |
1 | ౧ | ૧ | ఏక్ |
2 | ౨ | ૨ | బే |
3 | ౩ | ૩ | త్రణ్ |
4 | ౪ | ૪ | చార్ |
5 | ౫ | ૫ | పాంచ్ |
6 | ౬ | ૬ | ఛ |
7 | ౭ | ૭ | సాత్ |
8 | ౮ | ૮ | ఆఠ్ |
9 | ౯ | ૯ | నవ |