గుడిసిల్లు/ చుట్టిల్లు

వృత్తాకారంలో మట్టి గోడ పెట్టి మద్యలో ఒక దూలం పెట్టి దాని ఆధారంగా గోడపై నుండి వాసాలను శంఖాకరంలో పైకి అమర్చి దానిపై రెల్లు గడ్డి, బోద గడ్డి గాని కప్పి గోడకు ఒక తలుపు వుంచి నివాస యోగ్యంగా చేసిన ఇంటినే గుడిసిల్లు లేదా చుట్టిల్లు అని అంటారు. గుడిసిల్లు/చుట్టిల్లు ఇవి వృత్తాకారంలో వుండి ఒకే దూలం కలిగి కప్పు శంకాకారంలో పైకి వుంటాయి. పూరిల్లుకు లాగానె వీటికి పైకప్పు వేస్తారు. చుట్టిల్లు అంత సుఖం లేదు... బోడి గుండంత బోగం లేదు అనేది ఈ చుట్టిల్లుకు సంబంధించిన ఒక సామెత. రాతి గోడలు, పైకప్పు బండలతో వేసిన చుట్టిళ్లు కూడా వుంటాయి. ఇవి శాశ్వతమైనవి. ఇలాంటివి ఇప్పుడు కొత్తగా కట్టక పోయినా పాతవి అరుదుగా పల్లెల్లో కనబడు తున్నాయి. ( బొమ్మ చూడుము) ఇదే మాదిరి ఇళ్లను పక్కాగా కూడా నిర్మిస్తున్నారు. ఇలా వృత్తాకారంలో రాతి గోడల పై బండలు పరిచి కూడా శాశ్వతమైన ఇళ్ళను నిర్మిస్తారు. కాని వీటిని ఎక్కువ దాన్యపు గెరిసెలు, గాదెలుగా వుపయోగిస్తారు.

గుడిసిల్లు