గువ్వలచెన్న శతకము

గువ్వలచెన్న శతకమును సా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన కవి గువ్వల చెన్నడు రచించెను. ఇతడు వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినవాడు. " గువ్వల చెన్నా" అనే మకుటంతో ఈ శతకాన్ని కంద పద్యాలతో రచించాడు. ఇతడు లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించాడు. అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు.

గువ్వలచెన్న శతకము
గువ్వలచెన్న శతకం ముఖచిత్రం
కృతికర్త: గువ్వల చెన్నుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సాంఘిక విషయాలు
విభాగం (కళా ప్రక్రియ): శతకము
ప్రచురణ:
విడుదల:

కొన్ని ఉదాహరణలు మార్చు

తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.

క. గుడి కూలును నుయి పూడును

వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్

చెడనిది పద్యం బొకటియె

కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!

క. అనుభవము లేని విభవము లను

భావ్యయ కానీయాలు నార్యాను మతిన్

గనని స్వభావము ధర్మముఁ

గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా!

క. అడుగునకు మడుఁగు లిడుచును

జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్

వడిఁజేసి నంత మాత్రాన

కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా!

క. వెలకాంత లెందఱైననుఁ

గులకాంతకు సాటిరారు కువలయమందున్

బలువిద్య లెన్ని నేర్చినఁ

గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!

క. నీచునకు ధనము గల్గిన

వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్

నీచ కృతి యగుచు మది

సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!

పూర్తి పాఠం మార్చు

s:గువ్వలచెన్న శతకము పూర్తి పాఠం వికీసోర్సులో ఉంది.