గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం

గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం (GCP) అనేది గూగుల్ అందించే క్లౌడ్ సేవల వేదిక. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్, సర్వర్ లెస్ కంప్యూటింగ్ సేవలను అందిస్తుంది. ఇందులో కంప్యూట్, డేటా స్టోరేజ్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి సేవలు లభిస్తాయి. గూగుల్ తమ సేవలైన గూగుల్ శోధన, గూగుల్ డాక్స్ లాంటి వాటిని పనిచేయించే వేదికనే ఇతరులకు అద్దెకు ఇస్తుంది.[1] ఇందులో నమోదు చేసుకోవాలంటే కనీసం క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతా ఉండాలి.[2]

2008 లో గూగుల్ మొదటిసారిగా ఆప్ ఇంజిన్ అనే క్లౌడ్ వేదికను ప్రారంభించింది. దీని ద్వారా గూగుల్ నిర్వహించే డేటా సెంటర్లలో వెబ్ ఆధారిత అప్లికేషన్లను అభివృద్ధి చేసుకోవచ్చు, మొహరించవచ్చు (డెప్లాయ్‌మెంట్). నవంబరు 2011 నాటికి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆప్ ఇంజిన్ ప్రకటించిన నాటి నుండీ గూగుల్ అనేక సేవలను ఇందులో చేరుస్తూ వస్తోంది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజ్యూర్ (Azure), ఒరాకిల్ క్లౌడ్ (OCI) లాంటి సేవలతో గూగుల్ క్లౌడ్ పోటీ పడుతుంది. ఈ సంస్థలు దాదాపు ఒకేరకమైన సేవలతో తమలో తాము పోటీ పడుతుంటాయి.

ఉత్పత్తులు

మార్చు

గూగుల్ సుమారు 100కిపైగా ఉత్పత్తులను గూగుల్ క్లౌడ్ సేవల విభాగంలో ప్రకటిస్తుంది.

  • గూగుల్ ఆప్ ఇంజిన్ - ప్లాట్‌ఫాం సర్వీస్
  • గూగుల్ కంప్యూట్ ఇంజిన్ - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్
  • గూగుల్ క్యుబర్నెటిస్ ఇంజన్ - కంటైనర్ ఆధారిత సేవలు
  • క్లౌడ్ ఫంక్షన్స్
  • క్లౌడ్ రన్

రీజియన్లు, జోన్లు

మార్చు

గూగుల్ ఇతర క్లౌడ్ సేవల సంస్థ మాదిరిగానే తమ సేవలను రీజియన్లు (ప్రాంతాలు), జోన్లు (మండలాలు)గా విభజిస్తుంది. ప్రతి ప్రాంతం ఒక స్వతంత్రమైన భౌగోళిక విభాగం. ఒక్కో ప్రాంతంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మండలాలు ఉంటాయి. 2024 మొదటి త్రైమాసికం నాటికి గూగుల్ క్లౌడ్ లో 40 రీజియన్లు, 121 జోన్లు ఉన్నాయి.[3][4]

మూలాలు

మార్చు
  1. Verma, Abhishek; Pedrosa, Luis; Korupolu, Madhukar; Oppenheimer, David; Tune, Eric; Wilkes, John (17 April 2015). "Large-scale cluster management at Google with Borg". Proceedings of the Tenth European Conference on Computer Systems. Article 18, sec. 2.1 (p. 1), sec. 6.1 (p. 11). doi:10.1145/2741948.2741964. ISBN 9781450332385.
  2. "Google Cloud Free Tier – Google Cloud Platform Free Tier". Google Cloud.
  3. "Cloud locations". Google Cloud. Retrieved 5 April 2024.
  4. "Regions and Zones". Google Cloud. Retrieved 5 April 2024.