గూడూరు గోపాలరావు

సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడు

గూడూరు గోపాలరావు తెలుగువాడిగా జన్మించి, బ్రిటిష్ రాజ్యంలో మైక్రోబయాలజిస్టుగా అత్యుత్తమ సేవలందిస్తూ ప్రిన్స్ చార్లెస్ నుండి OBE award పొందిన వ్యక్తి.[1]

గూడూరు గోపాలరావు
జననం1954
కటక్
నివాస ప్రాంతంలండన్
వృత్తివైద్యుడు, సూక్ష్మజీవశాస్తజ్ఞుడు, పరిశోధకుడు
ఉద్యోగంఇంపీరియల్ వైద్యశాల
ప్రసిద్ధిLewisham Isolation Priority System
భార్య / భర్తనిర్మలా రావు
పిల్లలు2
తండ్రిగూడూరు వెంకటాచలం

వైద్య సేవలు

మార్చు

పూనాలోని ఎ.ఎఫ్.ఐ.పి. నుండి వైద్యంలో డిగ్రీ, తదుపరి మద్రాసు వైద్య కళాశాల నుండి పోస్టుగ్రాడ్యుయేషన్ చేసి 1983 లో యునైటెడ్ కింగ్‌డం తరళివెళ్ళారు. అక్కడ రాయల్ విక్టోరియా, సెయింట్ మేరీ వంటి వివిధ వైద్యశాలల్లో శిక్షణ పొందారు. 1990లో మైక్రోబయాలజిస్తుగా నియమితుడై పిదప లూయీషాం వైద్యశాలలో 1993 లో చేరి 2008 వరకు తన అమూల్యమైన సేవలందించారు. ప్రస్తుతం వీరు ఇంపీరియల్ వైద్యశాలలో ప్రధాన మైక్రోబయాలజిస్టుగా క్లినీషియన్ గా పనిచేస్తున్నారు.

వీరు ప్రధానంగా బాక్టీరియా వ్యాధుల నియంత్రణ, వ్యాధి నిర్ధారణ, వైద్యంలో ఆంటీబయోటిక్ ల వినియోగం మొదలైన విభాగాలలో వీరు ప్రతిపాదించిన లూయీషాం ఇసొలేషన్ ప్రయారిటీ వ్యవస్థ (Lewisham Isolation Priority System) బహుళ ప్రాచుర్యం పొందింది.[2] ఈ మార్గంలో వీరు విస్తృతంగా 120 దేశీయ, అంతర్జాతీయ ప్రచురణలు వెలువరించారు.[3] వీరి నాయకత్వంలో జరిగిన క్లమేడియా నియంత్రణ కార్యక్రమం ద్వారా లూయీషామ్, బ్రిటన్ లో ఈ వ్యాధి చాలావరకు అదుపులోకి వచ్చినట్లుగా గుర్తించారు.

వీరు ప్రస్తుతం దక్షిణాసియా లోను, ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలకు అంటువ్యాధుల నియంత్రణకు సలహాదారుగా సేవలందిస్తున్నారు.

వ్యక్తిగత విశేషాలు

మార్చు

వీరు ప్రముఖ వ్యవసాయ పరిశోధకులైన గూడూరు వెంకటాచలం గారి ఎమినిదిమంది సంతానంలో చివరివానిగా ఒడిశాలోని కటక్ లో 1954 లో జన్మించారు. వీరి తాతగారు గూడూరు రామచంద్రరావు. వీరి వంశం కృష్ణాజిల్లాకు చెందినది. వీరి సతీమణి నిర్మలా రావు కూడా పరిశోధకురాలు. వీరి ఇద్దరు కుమారులు కూడా వైద్యవృత్తిలోనే ఉన్నారు.

అందుకున్న పురస్కారాలు

మార్చు
  • వీరు బ్రిటన్ దేశంలో చేసిన సేవలకు గాను 2009 సంవత్సరంలో ప్రిన్స్ చార్లెస్ నుండి Order of the British Empire (OBE) award ను అందుకున్నారు.
  • వీరికి 2013 సంవత్సరంలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ లండన్ నుండి జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

మూలాలు

మార్చు