గూడూరు సీతామహాలక్ష్మి

గూడూరు సీతామహాలక్ష్మి అవయవదాన ఉద్యమ కారిణి, ఉపాధ్యాయురాలు . ఉండి వాస్తవ్యురాలు. 180 శరీర దానాలు,1500 అవయవాదానాలు చేయించిన వ్యక్తి.[1][2] ఆమె సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ (స్పెక్ట్‌) చైర్‌పర్సన్‌ గా పనిచేస్తుంది. ఆమె అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు.[3]

జీవిత విశేషాలు మార్చు

ఆమె పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉండి వాస్తవ్యురాలు. ఆమె తండ్రి అర్జునుడు ఉపాద్యాయుడు. ఆమె చిన్నతనం నుండి సామాజిక బాద్యలను తల్లిదండ్రుల నుండి నేర్చుకుంది. వైద్య వృత్తి చేపట్టాలని ఆమెకు కోరిక ఉన్నా, పేదరికం కారణంగా టి.టి.సి చేసి 18 యేళ్లకే ఉపాద్యాయురాలిగా ఉద్యోగంలో చేరింది. వృత్తి జీవితంలో ఉంటూనే బి.ఎ, బి.ఇ.డి, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం) డిగ్రీలను చేసింది. ఆమె భర్త రాజేంద్ర ప్రసాద్ ఇంజనీర్ వృత్తిలో ఉన్నాడు[4].

సామాజిక సేవ మార్చు

ఆమె సాధారణ ఉపాధ్యాయినిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన నాటి నుండి మాజ హితం కోసం తపించేది. ఆ సంకల్పంతోనే వందల మంది బాలికలు, అనాథ విద్యార్థులకు అండగా నిలిచింది. అవయవదానాలను జాతీయోద్యమ స్థాయికి తీసుకెళ్ళింది. "మరణించినా జీవించండి" అనే నినాదంతో శరీర, అవయవ దానాల ఉద్యమ కోసం అహర్నిశలూ శ్రమించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం ఆమె కృషి చేసింది. మృత దేహాలు భావితరం వైద్యులకు ప్రయొగ శాలగా ఉపకరిస్తాయని నమ్మిన ఆమె అపోహలు, ఆంక్షలను దూరం చేసేందుకు శ్రమించింది. ఆమె స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాలకు అవయవ దానం చేయడానికి ఒకేసారి 35 మంది రావడం జాతీయ స్థాయిలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. ఆమె సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు (స్పెక్ట్) ను స్థాపించి ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. [1]

పురస్కారాలు మార్చు

ఆమెకు 2023 జూలై మూడున అనంతపురంలో సేవాధార్మిక అవార్డు, రూ.50 వేల నగదు పురస్కారం అందుకుంది. ఆ నగదుతో పాటు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఎ.కృష్ణకుమారి రూ.50 వేలు, మరో ధార్మిక సంస్థ అందించిన రూ.50 వేలు కలిపి రూ.1.5 లక్షల చెక్కును అందుకుంది. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చదువుతున్న పేద విద్యార్థుల చదువుల కోసం వినియోగిస్తుంది.


మూలాలు మార్చు

  1. 1.0 1.1 "SPECT In Vizag: సాధారణ ఉపాధ్యాయిని... అసాధారణ ఉద్యమ స్ఫూర్తికి నాంది, spect-founder-guduru-seethamahalakshmi-story". web.archive.org. 2023-08-16. Archived from the original on 2023-08-16. Retrieved 2023-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "స్పెక్ట్‌ చైర్‌పర్సన్‌ సీతామహాలక్ష్మికి ఘన సత్కారం | SPECT Chairperson Sita Mahalakshmi is honored-NGTS-AndhraPradesh". web.archive.org. 2023-08-16. Archived from the original on 2023-08-16. Retrieved 2023-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "నాకో శవాన్ని ఇవ్వండి చాలు.. నలుగుర్ని బతికిస్తా". BBC News తెలుగు. 2020-12-05. Retrieved 2023-08-16.
  4. "శరీరం కోసం వెళ్తే.. కొట్టడానికొచ్చారు |". web.archive.org. 2023-08-16. Archived from the original on 2023-08-16. Retrieved 2023-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)