గృహహింస నిరోధక చట్టం

భారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. జమ్ము, కాశ్మీర్‌ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబంలోని మగవారు (భర్త /బావ/మరిది/ అన్నదమ్ములు/మామ/ కొడుకు/అల్లుడు/తండ్రి) జరిపే ఎటువంటి హింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.అంతకుముందు వరకట్న వేధింపుల చట్టం (498A) మాత్రమే ఉంది.

Purple ribbon.svg
పర్పుల్ రిబ్బన్ గృహహింస పై అవగాహన కోసం వాడే చిహ్నం

కుటుంబ హింస

మార్చు

ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురవడం కుటుంబ హింస కిందికి వస్తుంది. ఈ హింస చాలా రకాలుగా ఉంటుంది. మహిళలు రోజువారీ జీవితంలో అనేక హింసల్ని ఎదుర్కొంటూ వుంటారు. అవేమిటంటే-

  • శారీరక హింస అంటే శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం – అనగా శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి.
  • లైంగిక హింస అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టంలేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు లైంగిక హింస కిందకి వస్తాయి.
  • మాటల, భావోద్రేక హింస లేదా మానసిక హింస అంటే అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్నబుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసిస్తానని అదేపనిగా బెదిరించడం ఇవన్నీ మానసిక హింస కిందకు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనస్సును నొప్పిస్తూ, క్షోభకు గురిచెయ్యడం.
  • ఆర్థిక హింస – ఆర్థికమంటే డబ్బు లేదా వనరులు – కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకివ్వకపోవడం, చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం అంటే సాంప్రదాయంకానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా గానీ ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం, స్త్రీధనం దక్కకుండా చెయ్యడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటి నుంచి గెంటివేయడం ఆమె ఆదాయాన్ని గుంజుకోవడమేకాక అదనపు కట్నం తెమ్మంటూ వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస లేదా వేధింపుల కిందకు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు / పిల్లలకు సంబంధించి ఆ కుటుంబంలో మగవారి ద్వారా జరిగే ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా కూడా గృహహింస అవుతుంది. భర్తే కాకుండా ఇతర సంబంధీకుల ద్వారా కూడా.

మేజిస్ట్రేటు బాధ్యతలు

మార్చు

కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చట్టం కింద బాధితురాలు ఈ క్రింది ఉపశమనాలను మేజిస్ట్రేటును కోరవచ్చు. ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు రక్షణ ఉత్తర్వులు వేరుగా వుండేందుకు నివాసహక్కులు ఆర్ధిక ఉపశమన ఉత్తర్వులు పిల్లల ఆధీనపు ఉత్తర్వులు భాదితురాలిని ఫొన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, ఇ మెయిల్ ద్వారా మానసిక వేదనకు గురిచేస్తే వాటిని నిలుపుదల చేస్తూ మేజిస్ట్రేటు ఉత్తర్వులివ్వవచ్చు. గృహహింసకు సంబంధించిన కేసులను 60 రోజుల్లో విచారించి తీర్పు నివ్వాలి. కోర్టు ఉత్తర్వులను నిందితులు ఉల్లంఘిస్తే ఏడాది జలు శిక్ష గాని, 20,00/- జరిమానా గానీ రెండింటిని గానీ మేజిస్ట్రేటు విధించవచ్చు.[1]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-09. Retrieved 2015-02-18.