గై డి మొపాసా

(గై డి మపాసా నుండి దారిమార్పు చెందింది)

గై డి మొపాసా (5 ఆగస్టు 1850 – 1893 జూలై 6) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడా మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ కళ గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.

గై డి మొపాసా
పుట్టిన తేదీ, స్థలంHenri René Albert Guy de Maupassant
(1850-08-05)1850 ఆగస్టు 5
Tourville-sur-Arques
మరణం1893 జూలై 6(1893-07-06) (వయసు 42)
ప్యాసీ, ప్యారిస్
సమాధి స్థానంMontparnasse Cemetery
కలం పేరుGuy de Valmont, Joseph Prunier
వృత్తిరచయిత, కవి
జాతీయతఫ్రెంచి
రచనా రంగంన్యాచురలిజం, రియలిజం
ప్రభావంHonoré de Balzac, Gustave Flaubert, Hippolyte Taine, Émile Zola, Arthur Schopenhauer

సంతకం

బాల్యం

మార్చు

మొపాసా, లారే లి పొఇట్టెవిన్, గుస్తావ్ డి మొపాసా ల మొదటి సంతానంగా 1850 ఆగస్టు 5 లో ఫ్రాన్స్ లో జన్మించాడు. మొపాసాకి పదకొండేళ్ళు, అతని తమ్ముడికి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు స్వతంత్ర భావాలు గల అతని తల్లి భర్త నుండి విడి పోయింది. బాల్యంలో మొపాస పై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆమె సాహిత్యాన్ని, ముఖ్యంగా షేక్స్పియర్ సాహిత్యాన్ని బాగా ఇష్టపడేది.

చదువు

మార్చు

1870 లో గ్రాడ్యుఏషన్ పూర్తి చేసిన తర్వాత పారిస్ లోని నౌకాదళంలో పదేళ్ళపాటు క్లర్క్ గా పనిచేశాడు.

రచనలు

మార్చు

15 కథా సంకలనాలు, 3 ట్రావెలోగ్ లూ, 6 నవలలు,1 కవితా సంకలనం అతని సాహిత్య సృష్టి. మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు. సమాజంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే! స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు. మానవనైజంలోని అనేక పార్శ్వాలనూ పట్టుకున్నాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు. చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్’ (హ్యూగో) తర్వాత ఫ్రెంచ్ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వి’ (ఒక జీవితం) పేరుతెచ్చుకుంది.

శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ, దానికే మనం కృతజ్ఞులమై ఉండాలనీ చెబుతాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

‘నా బాస్ తలనొప్పిగా ఉందన్నా ఇంటికి వెళ్లడానికి అనుమతించలే’దని తల్లికి ఉత్తరం రాసిన మొపాసా... ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పుస్తకాలతో వచ్చిన పేరు, పేరుతో ఒనగూడిన సంపదతో నౌక కొన్నాడు. తన తొలి నవల పేరుమీదుగా ‘బెల్ ఎమీ’ (అందమైన స్నేహితుడు)గా దానికి నామకరణం చేశాడు. అందులో అల్జీరియా, ఇటలీ, ఇంగ్లండ్, సిసిలీలాంటి దేశాల్లో పర్యటించాడు. తన అపార్టుమెంటులోని ఒక రహస్య మూలను, అందమైన స్త్రీల చెవుల్లో తన సాహసయాత్రలు వర్ణించి చెప్పటానికే వినియోగించాడు. ఫలితంగా సుఖవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది.

1893 జూలై 6 లో పారిస్ లో మరణించిన మొపాసా అంతకు ముందు 1892, జనవరి 2 ఆత్మహత్య చేసుకోవటానికి విఫల ప్రయత్నం చేశాడు. ‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని లిఖించుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. ‘అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ’ గడిపివెళ్లిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Menikoff, Barry. The Complete Stories of Robert Louis Stevenson; Introduction. Modern Library, 2002, p. xx

ఇతర లింకులు

మార్చు

తెలుగు అనువాద కథ అదంతా కలేనా?