గొర్రెపాటి శ్రీను

తెలుగు కవి, రచయిత

గొర్రెపాటి శ్రీను వర్ధమాన తెలుగు రచయిత. ఇతని అసలు పేరు జి.నాగమోహన్ కుమార్ శర్మ.

గొర్రెపాటి శ్రీను
గొర్రెపాటి శ్రీను
జననం
జి.నాగమోహన్ కుమార్ శర్మ

(1976-08-14) 1976 ఆగస్టు 14 (వయసు 48)
జాతీయతభారతీయుడు
విద్యడిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
వృత్తిప్రైవేటు ఉద్యోగం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి
గుర్తించదగిన సేవలు
వెన్నెల కిరణాలు,
ప్రియసమీరాలు
తల్లిదండ్రులుబ్రమరాచార్యులు, శాంతకుమారి

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు గుంటూరు పట్టణంలో 1976, ఆగస్టు 14న బ్రమరాచార్యులు, శాంతకుమారి దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీశైలంలో జరిగింది. తరువాత హైస్కూలు విద్యను నల్లగొండ జిల్లా, గుర్రంపోడ్లో చదివాడు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌నుండి మెకానికల్ ఇంజనీరింగులో డిప్లొమా చేశాడు. హైదరాబాదులోని ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.[1]

రచనలు

మార్చు

ఇతడు 1000కి పైగా వచన కవితలు, 100కు పైగా కథలు, 4 నవలలు వ్రాశాడు. ఇతని రచనలు సంచిక, ఆంధ్రభూమి, నవ్య, రచన, సాహితీకిరణం, వార్త, సహరి, ప్రతిలిపి వంటి ముద్రిత, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఇతని రచనలలో కొన్ని:

  • వెన్నెల కిరణాలు (కవితా సంపుటి)
  • ప్రియసమీరాలు (కథా సంపుటి)
  • ప్రణయ దృశ్యకావ్యం (కవితా సంపుటి)
  • యువనాయకుడు (నవల)
  • కరిగేలోగా ఈ క్షణం (నవల)
  • కలం చెక్కిన శిల్పం (నవల)

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు. "గొర్రెపాటి శ్రీను". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 22 August 2024.

బయటి లింకులు

మార్చు

కథానిలయం జాలస్థలిలో గొర్రెపాటి శ్రీను పేజీ