గొలుసు పంపు అనగా ఒక రకమైన నీటి పంపు, ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.

Al-Jazari's hydropowered saqiya chain pump in 1206.
Two types of hydraulic-powered chain pump from the Chinese encyclopedia Tiangong Kaiwu (1637), written by Song Yingxing.

ఇవి కూడా చూడండిసవరించు

తాడు పంపు