గోథిక్
గోథిక్ కళ క్రీ.స్తు శకం పన్నెండవ శతాబ్దం లో ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో రోమనుల కళను నుండి అభివృద్ధి పరచబడిన మధ్య యుగపు కళా రూపం. మిగిలిన రూపాలలో ఉన్నా అతి ముఖ్యమైన రూపంగా శిల్ప కళ గానే స్థిరపడింది.
ప్రారంభం
మార్చుగోథిక్ కళ ఫ్రాన్సులో ’లై డి ఫ్రాన్స్’ ప్రాంతంలో ప్రారంభమైనది. పన్నెండవ శతాబ్దం ప్రారంభం లోనే ’అబ్బోత్ షుగర్’ కట్టిన సెయింట్ డెన్నిస్ అబ్బే చర్చిలో కనబడుతుంది.
పదం పుట్టుక
మార్చుగోథిక్ అఏ పదం కళ అనే అర్థం లో అనాగరీకులు అనే పదానికి పర్యాయ పదం గానే వాడడం జరిగింది. కళా విమర్శకుల దృష్టిలో ఈ మధ్య యుగపు కళ సంప్రదాయ కళాఖండాలకు ఉండే సౌంద్యం, ఆకృతి, ఎత్తు పల్లాలు లాంటి విషయాలేవూ వీటికి లేకపోవడమే కారణం గానే అలా భావించారు..
గోథిక్ చిత్ర కళ
మార్చుగోథిక్ చిత్రాలు అని పివబడుతున్నవి పన్నెండవ శతాబ్దం తర్వాత నే వచ్చాయి, అనగా గోథిక్ శిల్ప కళ, నిర్మాణాలు ప్రారంభమైన యాబై సంవత్సరాల తర్వాత నే చిత్ర కళ ప్రారంభమైంది.
కుడ్య చిత్రాలు
మార్చుప్రాచీన క్రైస్తవ, రోమన్ చిత్ర కళ పద్ధతులకుకొనసాగింపు గా ఈ కుడ్య చిత్రాలు చర్చి గోడలపై ముఖ్య అలంకారముగా దక్షిణ ఐరోపాలో విరాజిల్లాయి.
గాజు పై చిత్రాలు
మార్చుపదిహేనవ శతాబ్ది వరకూ ఉత్తర ఐరోపా ప్రాంతంలో ఒక ముఖ్యమైన, విలువైన కళా రూపంగా ఈ గాజు చిత్రాలు మన్ననలు చూరగొన్నది.
గర్బ గుడి, మందిర కీటీకీ ల పై చిత్రాలు
మార్చుగుడి, పదిహేను పదహారు శతాబ్దాలలో మాత్రమే కాన్వాసు పై తైల చిత్రాల చిత్రీకరణ ప్రారంభమయ్యింది. ఈ చిత్రణ కళ పునర్జీవణ కాలంలో వచ్చిన ఒక ముఖ్యమైన గుర్తుగా నిలిచింది.
శిల్ప కట్టడాలు
మార్చుగోథిక్ కాలం అంటేనే గోథిక్ శిల్ప కళ గానే గుర్తుండీపోయింది.పెద్ద పెద్ద చర్చి ద్వారాలు, ప్రవేశాలు ల దగ్గిర ఇది కనబడూతుంది.
సూక్ష్మ శిల్పాలు
మార్చుముఖముగా ప్ర్హాన్సు లోనూ తదితర సమీప ప్రాంతాలలో ఈ చిన్న పరిమాణం గల శిల్పాలను ఎక్కువగా సామాన్యులు, కొన్ని సార్లు స్త్రీల ఆదరణ పెరిగింది.
భారత్ లో గోతిక్ సంస్కృతీ వారసత్వ కట్టడాలు
మార్చుఆంద్రప్రదేశ్
మార్చుకర్నూలులో కోల్స్ సెంటీనియల్ చర్చి నిర్మాణంలో ఇతర చర్చిలకు భిన్నంగా నిలుస్తోంది. గోథిక్ నమూనాలో, ఎత్తైన ఆర్చిరీలతో దీన్ని నిర్మించారు. రోజ్‌ఉడ్ కలపతో చేసిన ఎత్తైన కిటికీలతో పుల్‌పీట్ ముందుభాగం విశాలంగా, పక్కన ప్రత్యేక గదులతో ఈ చర్చి అందంగా కనిపిస్తోంది. నూరు అడుగుల ఎత్తు ఉన్న ఈ చర్చి ఉన్నత శిఖరం లోపలి భాగంలో అమెరికా నుంచి కోల్స్ మహానీయుడు పంపించిన గడియారం, గుడి గంటలతో అలంకరించారు. నిర్మాణంలో కర్నూలులో దొరికే సున్నపురాయినే వినియోగించారు.[1]
దిల్లీలోని గ్రేటర్ నోయిడా
మార్చుగోథిక్ శైలిలో గ్రాండ్ వెనిస్ మాల్.నీళ్లలో నిర్మించిన వెనిస్ నగరంలో ఎటు వెళ్లాలన్నా పడవే శరణ్యం. ఆ పడవల్నే అక్కడ గొండొలా అని పిలుస్తారు. అక్కడక్కడా భవంతుల్ని కలుపుతూ వంతెనలు ఉన్నా, వీధుల్లో తిరగాలన్నా ఒకచోటు నుంచి మరోచోటుకి వెళ్లాలన్నా పడవల్లోనే వెళ్లాలి. అందుకే వెనిస్ నగరమంటే పర్యటకులకు అమిత ప్రీతి. అయితే వెనిస్ పర్యటన అనేది చాలామందికి తీరని కలే. అందుకే ఆ అనుభవాన్ని దిల్లీ వాసులకీ ఆ నగర పర్యటకులకీ అందుబాటులోకి తీసుకొచ్చింది గ్రాండ్ వెనిస్ మాల్. ఇందులో కూడా అచ్చం వెనిస్‌లో ఉన్నట్లే మధ్యమధ్యలో వంతెనలూ నిర్మించారు. పడవ నడిపేవాళ్లు కూడా
ఇటాలియన్ వేషధారణలో ఆ భాషలోనే పాడుతూ అచ్చం వెనిస్‌లో ఉన్న ఫీల్‌నే కలిగిస్తారు. అంతేకాదు, అక్కడ విహరిస్తుంటే బ్యాక్‌డ్రాప్‌లో ఇటాలియన్ పీసా టవర్ కూడా కనిపిస్తుంటుంది. భవంతి వెలుపలి భాగంలో ఫౌంటెయిన్‌ను సైతం రోమ్‌లోని ట్రెవీ ఫౌంటెయిన్‌ను పోలినట్లే నిర్మించడం విశేషం. దాదాపు 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మాల్ లోపల సెయింట్ మార్క్ బాసిలికా, ద స్టాచ్యూ ఆఫ్ జూలియస్ సీజర్... వంటి నిర్మాణాలను ఏర్పాటుచేయడంతోబాటు భవంతులన్నీ కూడా రోమన్ల గోథిక్ శైలినే ప్రతిబింబిస్తూ ఇది దిల్లీనా ఇటలీనా అన్న భ్రమని కలిగిస్తాయి.[2]
మహరాష్ట్ర లోని ఛత్రపతి శివాజీ టెర్మినస్
మార్చు1887-1888లో కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ అయిన "ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్", దీని డిజైన్ రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించాడు. 10 సంవత్సరాల కాలంలో నిర్మించి విక్టోరియా రాణి గౌరవార్థం దీనికి "విక్టోరియా టెర్మినస్" అనే పేరు పెట్టాడు.రు విక్టోరియా టెర్మినస్, సాధారణంగా దీని సంక్షిప్త నామం 'సి.ఎస్.టీ' లేదా 'బాంబే వీ.టీ. (CST or Bombay VT). ఇది కేంద్ర రైల్వేకు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తుంది. భారతదేశంలోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది కేంద్ర రైల్వే కేంద్రంగానే గాక 'ముంబై సబర్బన్ రైల్వే' కేంద్రంగానూ సేవలందిస్తోంది.ఈ నిర్మాణం 'విక్టోరియన్ గోథిక్' లేదా 'వెనీషియన్ గోథిక్' శైలిలో నిర్మింపబడింది. 19 వ శతాబ్దపు నిర్మాణాలకు ఆదర్శం.
చెన్నై
మార్చుచెన్నైలో చాలా వలసపాలకుల భవనాలు, గుర్తులు ఉన్నాయి. మీరు వాస్తుశిల్పం, చరిత్రను తెలుసుకోవాలంటే, చెన్నై ఈ ప్రాంతాల ద్వారా మీకు ఘన స్వాగతం పలుకుతోంది.
ప్రభుత్వ మ్యూజియం, ఎగ్మోర్
మార్చుఇది భారతదేశంలోనే రెండో పురాతమైన మ్యూజియం, 6 భవంతులు, 46 గ్యాలరీలతో ఈ మ్యూజియం ఉంటుంది. భూగర్భ శాస్త్రం, పురావస్తు శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శాస్త్రం, నాణాల సేకరణ శాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్ర్రాలకు చెందిన విషయాలను ఇక్కడ చూడొచ్చు.
బసిలికాశాన్ థోమ్
మార్చు16వ శతాబ్దంలో సెయింట్ థామస్ సమాధిపై నిర్మించబడ్డ ఈ కట్టడాన్ని 1893లో బ్రిటీష్ పాలకులు నూతన -గోథిక్ సంప్రదాయంలో పునర్ నిర్మించారు, శాన్ థోమ్ బసిలికా యాత్రికులకు చారిత్రక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది.
సెయింట్ జార్జ్ కోట
మార్చుమద్రాస్ ప్రావిన్స్‌ను బ్రిటీష్ వారు ఈ భవనం నుంచే పాలించారు, ప్రస్తుతం ఈ భవనంలో తమిళనాడు శాసనసభ కొనసాగుతోంది. 1644 నుంచి ఈ భవనం నుంచే శతాబ్ధాల పాటు బ్రిటీష్ పాలన సాగింది, తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన భవనాల్లో ఇది కూడా ఒకటి.కోటలోపలే కోటమ్యూజియం ఉంటుంది.
రిప్పన్ భవనం
మార్చుప్రస్తుత చెన్నై నగర పాలక సంస్థ పరిపాలనా భవనం. ఈ భవనం పూర్తిగా తెల్లగా, నూతన-శాస్త్రీయ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇది గోథిక్, ఐయోనిక్, కోరింథియన్ శైలిల మిశ్రమ నిర్మాణం[3].
చెన్నై సెంట్రల్
మార్చుఇది భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్, బ్రిటీష్ వాస్తు నిర్మాణాలకు అద్భుతమైన సాక్ష్యం. 142 ఏళ్ల చరిత్రగల ఈ భవనాన్ని ఆర్కిటెక్ట్ జార్గ్ హార్డింగ్ డిజైన్ చేశారు.