గోబర్ గ్యాస్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు.. ఇలా సంప్రదాయ ఇంధనాల ధరలు ఇటీవలి కాలంలో మండిపోతున్నాయి. విచ్చలవిడి వినియోగం వల్ల క్రమేణా తరిగిపోతున్నాయి. కానీ ఎంత వాడుకున్నా ఎప్పటికీ తరగని సహజ ఇంధన వనరులు మన చుట్టూనే మనకు అందు బాటులోనే ఉన్నాయి. వాటిని గుర్తించి గ్రహించ గలిగి సద్వినియోగ పర్చుకోగలిగితే చాలు మన అవసరం తీరడమే గాక దేశానికి కూడా మన వంతు సాయం చేయగలిగిన వారమౌతాము. అలాంటి వాటిలో ఒకటి గోబర్ గ్యాస్ ఒక ఇంట్లో రెండు పశువులుంటే, నెలకు రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లే లెక్క! బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి వెలువడే మిథేన్ గ్యాస్ వంటకు ఉపయోగపడితే, చివరకు మిగిలే స్లర్రీ (పేడ) లో నైట్రోజన్, పంటలకు ఎరువు రూపంలో మేలుచేస్తుంది.
పల్లెవారికే ఎక్కువ అనుకూలత
మార్చుగోబర్ గ్యాస్ ఉత్పత్తి పల్లె వాసులకే ఎక్కువ అనుకూలము, ఉపయోగము: ఎందు వలనంటే... పల్లెవాసుల కుటుంబాలకు తప్పని సరిగా ఒకటి రెండు పశువులుంటాయి. ఇంటి ఆవరణము ఎక్కువగా వుంటుండి. గోబర్ గ్యాస్ ప్లాంటు నిర్మాణానికి కావలసిన స్థలముంతుండి. గోబర్ గ్యాసు తీసుకున్న తర్వాత మిగిరిలి వ్యర్థ పదార్థము వారి పంట పొలాలకు ఎరువుగా ఉపయోగ పడుతుంది. దిబ్బల్లో పోగు చేసి ఎరువుగా వాడే పేడ కంటే ఈ గోబర్ గ్యాస్ నుండి వ్వర్థ పదార్థ మైన పేడ పైరు పంటలకు ఎక్కువ ఉపయోగకరము. పశువుల పేడనే కాకుండా వంటింట్లో వెలువడే వ్యర్థ పదార్థాలైన కడుగు నీళ్ళు, కూరగాముక్కలు, మిగిలిపోయిన కూరలు మొదలగునవి కూడా గోబర్ గ్యాస్ ఉత్పత్తి కొరకు వాడుకోదగినవే. స్థలాభావము వలన, పశువులు లేనందున పట్న వాసులకు ఇది అంత ఉపయోగ కరము కాదు.
ఉపయోగములు
మార్చుగోబర్ గ్యాస్ కేవలము వంట కొరకే ననే అపోహ ఉంది. కొంత వరకు అది సమంజసమే... గోబర్ గ్యాస్ ను ఎక్కువగా వంటలకే ఉపయోగిస్తున్నారు. మాటి మాటికి పెరిగే గ్యాస్ ధరల బాధకు ఇదొక ప్రత్యామ్నాయము. ఇంట్లో ఒక చిన్న గోబర్ గ్యాస్ ప్లాంటు వుంటే నెలకు ఒక గ్యాస్ సిలెండరు వున్నట్లే. వీటి ధర పెరగదు. గ్యాస్ ఎప్పుడొస్తుందో ననే భయము అకర లేదు. గోబర్ గ్యాస్ వంటలకే కాకుండా లైట్లు వెలిగించు కోవచ్చు... పెట్రోమాక్సు లైట్లకు ఈ గోబర్ గ్యాస్ ఉపయోగించి లైటు వెలిగించు కోవచ్చు. దాని వల కరెంటు ఖర్చును కూడా తగ్గించు కోవచ్చు. అంతే గాక గోబర్ గ్యాస్ ప్లాంటు కొంత పెద్దదైతే.... దాని ద్వారా వచ్చే గ్యాసును, గ్యాస్ తో నడిచే మోటార్లను వాటి చిన్న చిన్న పనులకు వాడుకోవచ్చు.
ఆరోగ్య పరమైనది
మార్చుఎలాగంటే.... పలలెలలో పశువుల పేడను తమ ఇండ్ల చుట్టు దిబ్బలు వేసుకుంటుంటారు. వాటికి పైన కప్పు వుండదు. కనుకు వాటి నుండి వెలువడే ప్రమాదకరమైన వాయువుల బెడద వుండదు. గోబర్ గ్యాస్ ప్లాంటు మూసు వున్నందున ఇటువంటి ప్రమాద కరమైన వయువులు వెలువడే అవకాశము లేదు. పైగా కట్టెల పొయ్యిలు, లేదా పిడకల పొయ్యిలు వలన వచ్చే పొగ... దాని వలన వచ్చే అనారోగ్యము నుండి గోబర్ గ్యాస్ వాడకము వలన దూరంగా వుండ వచ్చు.
ధనము ఆదా
మార్చుగోబర్ గ్యాస్ ప్లాంటు నిర్మించు విధానము
మార్చుకమ్యూనిటి గోబర్ గ్యాస్ ప్లాంటు
మార్చువనరులు
మార్చుhttps://web.archive.org/web/20120421043704/http://www.indg.in/rural-energy/rural-energy/sources-of-energy/c2cc2fc4bc2ec3ec38c4d-1 https://web.archive.org/web/20160305204107/http://namasthetelangaana.com/districts/karimnagar/ZoneNews.asp?category=18&subCategory=15&ContentId=161638