గోరింట

(గోరింటాకు నుండి దారిమార్పు చెందింది)

గోరింట చెట్టు కొంతమంది ఆకుల కోసం పెంచుతారు.

గోరింట
Lawsonia inermis Ypey36.jpg
Lawsonia inermis
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Genus
Species
Lawsonia inermis

గోరింటాకుసవరించు

గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృత పదం నుండి ఉద్భవించింది. మెహందీ, పసుపులయొక్క ఉపయోగముల గురించి హిందూమత వేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని (పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలో ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయ భారతనమూనాలలో మెహందీని చేతులు, కాళ్ళుగుర్చి ఉద్దేశించబడింది.

పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా (గోరింట)అని పిలుస్తారు. భారతదేశం, నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. భారతీయ సినిమా అయిన బాలీవుడ్, పాకిస్తాన్, బంగ్లాదేశీలు, అలాగే ఇతర దేశాలు కూడా మేహేందిని ఉపయోగిస్తారు. కోఆపరేషన్ కౌన్సిల్ ప్రకారం ఈ సంప్రదాయం గల్ఫ్ జాతీయులు అయిన ఆరబ్ దేశాల మహిళలు ఎక్కువగ ఉపయొగించుట ద్వారా విస్థరించింది.. మెహందీ అలంకరణను వారు కొన్నిసార్లు గోరింట పచ్చబొట్లు (హెన్నాటటూ) అని పిలుస్తుంటారు. 1990 ల చివరిలో పశ్చిమములోఇది ఒక నాగరీకంగా మారింది.

మెహందీని సాధారణంగా వివాహనికి, ఖర్వ చౌత్, ఆషాఢ శుద్ధ పూర్ణిమ, దీపావళి, భైదూజ్, తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో చాలామంది మహిళలు హెన్నాని వారి చేతులుకు, కాళ్ళుకు అలంకరించుకుంటారు. ఇది చర్మంపై సహజంగా ఉండే అలంకరణగా కనిపిస్తుంధి. హెన్నా నిజానికి ప్రధానంగా హిందూమతం వధువులకు ఒక అలంకరణరూపంగా ఉపయోగించబడింది.ముస్లింలు పండుగలు అయిన ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అధా సమయంలో మెహందీని వాడతారు.

భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని (హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కోసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన, శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్కృతి ఇప్పటికి బెంగాల్లో వాడుకలో ఉన్నధి.

చిత్రమాలికసవరించు

సాధారణ, సులభమైన మెహేంది నమూనాలు http://www.youtube.com/watch?v=UcNrXuRPoJA

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గోరింట&oldid=2980381" నుండి వెలికితీశారు