గౌతమి (ఫాంటు)
గౌతమి మైక్రో సాఫ్ట్ విండోస్ ఎక్స్ పీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో అనుసంధానించబడిన ఒక ట్రూటైప్ తెలుగు యూనీకోడ్ ఫాంటు. ఈ ఫాంటు యొక్క 1.2.1 వ వర్షన్‌లో 614 గ్లిఫ్‌లు ఉన్నాయి. ఈ ఫాంటును రఘునాథ జోషీ, ఓంకార్ షిండే యూజర్ ఇంటర్‌ఫేజు కొరకు తయారుచేశారు. [1] గౌతమి అనేది తెలుగు లిపిని ప్రదర్శించడానికి ఉపయోగించే ఒక మైక్రోసాఫ్ట్ విండోస్ టైప్ ఫేస్. విండోస్ సర్వర్ 2003, విండోస్ సర్వర్ 2008, విండోస్ ఎక్స్ పి, విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8 లలో దీని వెర్షన్లు సరఫరా చేయబడ్డాయి.[2] ఇది దిగువ శ్రేణిలకు యూనికోడ్ మద్దతును కలిగి ఉంది.ఇది మొదట 2001 సంవత్సరంలో విడుదల అయినది.ఇంటర్నెట్ లో ఎక్కడైనా తెలుగు ను చదవడం, రాయడం కొరకు బాగా ప్రచారంలో ఉన్న తెలుగు యూనికోడ్ ఫాంట్ గౌతమి . ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఖతి ఉండటం వలన వెబ్లో తెలుగు యీనికోడ్ రూపంలో న్యూస్ పేపర్, తెలుగు కంటెంట్ ఏదైనా వెబ్ సైట్ లో చదవటం సులువైనది. ఈ టైప్ ఫేస్ Office అప్లికేషన్ ల్లో కూడా లభ్యం అవుతుంది.ఇప్పటికి చాలా వరకు పాత కంప్యూటర్ లలో తెలుగు కోసం ఈ ఖతిని ఉపయోగిస్తారు . దీని వలన వేరే Office అప్లికేషన్ వాడుతున్నప్పుడు రూపురేఖలు మారవు.
ఫాంటు పేరువెనుక చరిత్ర
మార్చునేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ నుంచి తెలుగు కు రిసోర్స్ పర్సన్ అయిన రాధిక మామిడి[3] R_K_Joshi టీమ్ తో కలిసి పనిచేస్తున్నప్పుడు "గౌతమి" అనే పేరు పెట్టారు. ఇది గోదావరి నది యొక్క ఉపనది గౌతమి" ను సూచిస్తుంది. గౌతమి, గోదావరి నదులకు తెలుగు మాట్లాడే సమాజంతో గాఢమైన అనుబంధం ఉంది. అందువల్ల, ఈ టైప్ ఫేస్ యొక్క పేరు చాలా మంచిగా కనిపిస్తుంది.
ప్రాథమిక లాటిన్
లాటిన్-1 సప్లిమెంట్
తెలుగు
గౌతమి ఇండిక్ స్క్రిప్ట్-తెలుగు కోసం ఓపెన్ టైప్ ఫాంట్. ఇది యునికోడ్ పై ఆధారపడింది, ట్రూటైప్ రూపురేఖలను కలిగి ఉంది, UI ఫాంట్ వలె ఉపయోగించటానికి రూపొందించబడింది.
అవలోకనం
ఫైల్ పేరు Gautami.ttf
గౌతమిబ్.టిఎఫ్
స్టైల్స్ & బరువు గౌతమి
గౌతమి బోల్డ్
డిజైనర్లు రఘునాథ్ జోషి (టైప్ డైరెక్టర్), ఓంకర్ షెండే
కాపీరైట్ © 2015 మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్
స్క్రిప్ట్ టాగ్ లు dlng:'Telu' slng:'Telu'
కోడ్ పేజీలు 1252 లాటిన్ 1
ఫిక్సిడ్ పిచ్ లేదు
మూలాలు
మార్చు- ↑ "Gautami Font Family". Microsoft. October 20, 2017.
- ↑ alib-ms. "Gautami font family - Typography". docs.microsoft.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
- ↑ "Radhika Mamidi | IIIT Hyderabad". www.iiit.ac.in. Archived from the original on 2021-05-11. Retrieved 2020-08-30.