గౌతమ బుద్ధుని జీవితము.., ద్విపద కావ్యం

దూసి రామమూర్తి శాస్త్రి గారు గౌతమ బుద్ధుని జీవితము అనే గ్రంధాన్ని 24 ఏప్రిల్ 1929లో వ్రాశారు. కాని కొన్ని కారణాంతారాల వలన అది అచ్చుకు నోచుకోలేదు. రాజమండ్రి వాస్తవ్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు గౌతమీ విద్యాపీఠం ప్రాచ్య కళాశాల, ప్రధానోపాధ్యాయులుగా వున్నప్పుడు ఆ గ్రంథప్రతిని వెలుగులోకి తెచ్చారు. అన్ని విధాల సమగ్రముగా నున్న ఈ గ్రంథం మంజరీ ద్విపదలో రచించారు. ఈ గ్రంథంలో సమయోచిత సంభాషణలు, సందర్భాను సారమైన వర్ణనలు ఉన్నాయి.

ఈ గ్రంథాన్ని గౌతమ బుద్ధుని జీవితము ... ద్విపద కావ్యం అనేపేరుతో 'ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం వారు ' 2006 లో ప్రచురించారు.

ఉదాహరణకు గ్రంథంలోని కొంత (ద్వితీయాశ్వాసము)

శ్రిశుని కృపనెద్ది | చేకూర కుండు సజ్జనులకు నెద్ది | సమకూర కుండు మాయాసతీ గర్భ | మణి మందిరమున సర్వేశుడువసించె | సత్య సంధుండు నెలతకు నెల మీఱె | వెలవెల బాఱె బడలిక యును నిద్ర | బహుళంబులయ్యె నడమందయన్నెను | నాతి చెక్కిళ్ళు పలుచనై వహించె | బాడుర చ్ఛాయ ఒకిలి కింతలు హెచ్చె | సుగరంబు హెచ్చె నిన్నాళ్ళవలె భక్తి | నీశ్వరార్చనయు జేయన శక్తయై | చించించు మదిని పేరోలగంబున | బృథ్వీశుడుండ

{మూలం} దూసి రామమూర్తి శాస్త్రి గారి గ్రంథం: గౌతమ బుద్ధుని జీవితము..... ద్విపద కావ్యం.