ప్రధాన మెనూను తెరువు

గ్రాండ్ హోటల్ యెరెవాన్ (అర్మేనియన్:Գրանդ Հոթել Երևան), ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఒక 5-స్టార్ హోటల్. ఇది కెంట్రాన్ జిల్లా కెంద్రంలో ఉన్నది. దీనిని 1926వ సంవత్సరంలో సోవియట్ కాలంలో, ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ప్రారంభించారు. ఆర్మేనియాలో ఇంకా ఉన్నటువంటి పురాతన హోటళ్ళలో ఇది ఒకటి, అంతేకాక ఇది యరెవాన్ లో అతి పురాతనమైన హోటల్.[1][2]

గ్రాండ్ హోటల్ యెరెవాన్
Նկարիչների միության շենքը Երևանում 02.JPG
సాధారణ సమాచారం
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
భౌగోళికాంశాలు40°10′53″N 44°30′59″E / 40.18139°N 44.51639°E / 40.18139; 44.51639
ప్రారంభం1926
యజమానిరెంకో ఎస్.పి.యే
యాజమాన్యంస్మాల్ లక్జరీ హోటల్స్ ఆఫ్ ద్ వోర్ల్డ్
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య4
రూపకల్పన మరియు నిర్మాణం
వాస్తు శిల్పినికోలాయ్ బునియాటియన్
ఇతర విషయములు
గదుల సంఖ్య104
రెస్టారెంట్ల సంఖ్య4
జాలగూడు
అధికారిక సైటు

ఈ హోటల్ 14 అబోవియన్ స్ట్రీట్లో ఉంది, ఇది చార్లెస్ అజ్నావోర్ స్క్వేర్కు పైకి, అర్మేనియా యొక్క ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రక్కనే ఉంది.

చరిత్రసవరించు

ఆర్కిటెక్ట్ నికోలాయ్ బునియాటియన్ డిజైను ఆధారంగా ఈ హోటల్ ను 1926వ సంవత్సరం లో అర్మేనియన్ ఎస్.ఎస్.ఆర్ ఒక ప్రభుత్వ-యాజమాన్య హోటల్ గా ప్రారంభించారు. సోవియట్ యూనియన్ పాలిస్తున్న సమయంలో హోటళ్ళు మరియు పర్యాటక రంగాల నియంత్రణ సంస్థ అయిన ఇంటూరిస్ట్ సంస్థ పేరిట "ఇంటూరిస్ట్ హోటల్"గా దీనిని పిలిచేవారు. ఆవిధంగా, సోవియట్ అర్మేనియాలో ప్రారంభమైన మొట్టమొదటి హోటల్ గా యెరెవాన్ హోటల్ ఏర్పడింది.[3]

1930 వ దశాబ్దంలో, ఈ హోటల్ నగరంలోకి మేధోసంస్థలైన యెఘిషే చారెంట్స్, యెరెవాండ్ కోచార్ మరియు వాహ్రం పాపజీయన్లకు ఒక సాధారణ సమావేశ ప్రదేశంగా మారింది.[మూలాలు తెలుపవలెను]

1959వ సంవత్సరంలో, ఇంటూరిష్ట్ సంస్థను రిపబ్లిక్ స్క్వేర్ వద్ద కొత్తగా ప్రారంభమైన అర్మేనియా హోటల్ కు బదిలీ చేశారు, మరియు ఇంటూరిష్ట్ హోటల్ పేరు క్రమంగా "యెరెవాన్ హోటల్"గా పిలవబడింది.

యు.ఎస్.ఎస్.ఆర్ కుప్పకూలిన తర్వాత, ఇటాలియన్ కంపెనీ రెంకో ఎస్.పి.యే యెరెవాన్ హోటల్ ను కొనుగోలు చేసింది. ఒక పెద్ద పునర్నిర్మాణం తరువాత 1999వ సంవత్సరంలో "గోల్ఫ్ తులిప్ హోటల్ యెరెవాన్"గా ఈ హోటల్ తిరిగి ప్రారంభించబడింది. దీనిని గ్రూప్ డూ లౌవ్రే చే సంస్థ నిర్వహిస్తుంది. 2009వ సంవత్సరంలో, మరొక ప్రధాన పునర్నిర్మాణం తరువాత ఈ హోటల్ '''రాయల్ తులిప్ గ్రాండ్ హోటల్ యెరెవాణ్'''గా పిలవబడే 5-నక్షత్రాల హోటల్ గా నవీకరణ చేయబడింది.[4]

గ్రాండ్ హోటల్ యెరెవాన్ 2017 ఆరంభం నుండి స్మాల్ లక్జరీ హోటల్స్ ఆఫ్ ద్ వోర్ల్డ్ సంస్థ నిర్వహిస్తోంది.[5]

ప్రత్యేకతలుసవరించు

హోటల్ పైకప్పు మీద ఒక బహిరంగ ఈత కొలను ఉంది. ఒక ఆరోగ్య మరియు స్పా సెంటర్, ఇటాలియన్ "రిస్టోరెంటే రొస్సీని", "డోల్స్ వీటా" బార్, "వింటర్ గార్డెన్" కేఫ్, మరియు "జన్జిబార్" అవుట్ డోర్ బార్ ఇక్కడ ఉన్నాయి. ఈ హోటల్ నాలుగు సమావేశ మందిరాలను కలిగి ఉంది.

గోల్డెన్ అప్రికోట్ యెరెవాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్న సాధారణ వేదికలలో గ్రాండ్ హోటల్ యెరెవన్ ఒకటి.

ఈ హోటల్ ను సమీపంలోని రిపబ్లిక్ స్క్వేర్ భూగర్భ స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు.

మూలాలుసవరించు