గ్రామ నామాల చరిత్ర

ప్రతీ ఒక్కరూ వారి వారి గ్రామ చరిత్రను ఆయా ఊరి పెద్దలను అడిగి తెలుసుకోవాలి, భావితరాలకు తెలియచేయాలి, అందించాలి అందుకు పురాతన గ్రంధాలు చదివాలి, శిధిలావస్థలో వున్న దేవాయాలను పునరుద్ధరించాలి, ఇటువంటి పురాతన గ్రంధాలను తిరిగి ముద్రించాలి, అలా చదివి వదిలెయ్యకుండా ఇలా అందించాలి. అటువంటి ఔత్సాహికుల సమాచారం కోసం ఆ మహాయజ్ఞంలో భాగంగా ఈ ఉడతాభక్తి సేవ! సత్యసాయి - విస్సా నిలయం, పినపళ్ళ

   ఉదాహరణకు : మీ గ్రామం అన్నవరప్పాడు గ్రామం అనుకోండి. ఆ గ్రామం పూర్వ నామం గురించి తెలుసుకోవాలనుందా?  అయితే ఇది చదవండి. 
పులపర్తి "పులుపర్తి"  నామమున బరగిన గ్రామమా ప్రాంతము రెడ్డిరాజులు పాలనములోనికి వచ్చినపుడది "అన్యమావరము" గ (నేటి అన్నవరప్పాడుగ) మారినది. "కడింపాడు" పూర్వము "కడమి" యనియు " పేకేరు " పూర్వము "ప్రేకేడి" యనియు " ముక్కామల "  పూర్వము "ముంక్రోమల" యనియు పిలవబడు చున్నట్లు శాసనాధారములు గలవు. ఏతద్విషయము  నిరూపింప (*)ఉత్తరేశపురశాసనోక్త సీమావధుల పేర్కొనవచ్చును. అవి ఇట్లున్నవి :-

దీనికి ఆధారం ఏమనగా?

శ్రీ పంచలింగ క్షేత్ర దర్శనం అనే గ్రంధాన్ని రచించిన గ్రంథ కర్త " చరిత్ర విద్యాధర " తురగా కృష్ణమూర్తి, బి.ఏ., శ్రీ మార్ఖండేయ మృకండేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఖండవల్లి వారి గ్రంధాన్ని చదివి ఈ వివరాలు రాయడం జరిగింది. ఈ ప్రాచీన గ్రంధం త్వరలో పునర్ముద్రణ చేయబడుతోంది. శ్రీ తురగా కృష్ణకుమార్ గారు ఈ మహత్కర్యానికి పూనుకున్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా మా ఈ ఉడతాభక్తి సేవ! సత్యసాయి - విస్సా నిలయం, పినపళ్ళ