గ్రీకు ఋణ సంక్షోభ కాలరేఖ
గ్రీకు ప్రభుత్వ ఋణ సంక్షోభం 2009లో మొదలై ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో గ్రీసు దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందరో గ్రీకు పౌరుల జీతాలు భారీగా తరుగుకు గురయ్యాయి, నిరుద్యోగ సమస్య పెరిగింది, రాజకీయ నాయకుల ఎంపిక-రాజీనామాల పర్వాలతో దేశ రాజకీయ ముఖచిత్రం మునుపెన్నడూ లేని మార్పులకు గురయింది. గ్రీకు పార్లమెంట్ పొదుపుకు మార్గాలనుపదేశిస్తూ ఎన్నో విధానాలను బిల్లులుగా ప్రవేశపెట్టింది. దేశమంతటా ధర్నాలు, సమ్మెలు సర్వసాధారణంగా కనిపించసాగాయి. 2009లో జరిగిన గ్రీకు ఎన్నికల నుండి మొదలుకొని ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ సారాంశంగా ఇవ్వబడ్డాయి.
నేపథ్యం
మార్చుగ్రీసు యురోపియన్ యూనియన్ లో 1981 జనవరి 1న సభ్యత్వం తీసుకుంది. అప్పట్లో యురోపియన్ యూనియన్ ని యురోపియన్ కమ్యూనిటీస్ గా వ్యవహరించేవారు. అప్పటికి గ్రీసు ఆర్థికంగా మెరుగ్గా ఉండేది, నిరాటంకంగా గ్రీకు ఆర్థిక వ్యవస్థ అక్కడి నుండి అభివృద్ధి పొందుతూ వచ్చింది కూడా. అన్ని వైపుల నుండి పెట్టుబడుల రాక, భారీ పరిశ్రమల నిర్మాణం, యురోపియన్ యూనియన్ పెట్టుబడులు, సేవ-పర్యాటక-నౌకా రంగాల నుండి వస్తున్న రాబడి, అన్ని వెరసి జీవన స్థాయిని ఎన్నో రెట్లు పెంచేసాయి. 2001 లో గ్రీస్ తన సొంత కరెన్సీని వదిలి యూరోను కరెన్సీగా వాడటం మొదలుపెట్టింది. అక్కడ మొదలు 7 ఏళ్ళలో దేశ స్థూల దేశీయోత్పత్తి మూడు రెట్లయింది. 2001లో $12,400 నుండి 2008లో $31,700 కు పెరిగింది.[1] ఏథెన్స్లో జరిగిన ఒలంపిక్ ఆటల లాంటి భారీ పెట్టుబడి ఉన్న అంశాలలో ఎక్కువ మొత్తంలో గ్రీకు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను యురోపియన్ కమిషన్, యురోపియన్ సెంట్రల్ బ్యాంక్, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల నుండి ఋణ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. 2007-08 లో ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు గ్రీకు ఆర్థిక వ్యవస్థ బాగా ప్రభావితమయింది. 2008-10 మధ్యలో దేశ స్థూల దేశీయోత్పత్తి దాదాపు 20 శాతం తగ్గింది. తద్వారా అప్పులను తీర్చాల్సిన భారం పెరిగి, అప్పు తీర్చే స్తోమత పడిపోయింది.
2009
మార్చు- 2009 అక్టోబరు 4 – 2009 ఎన్నికలలో మధ్య-వామ పక్ష పార్టీ PASOK గెలుపు. 43.92% వోట్లతో 300 కు గానూ 160 పార్లమెంట్ సీట్లతో ఎన్నిక.[2]
- 2009 అక్టోబరు 20 – గ్రీకు బడ్జెట్ లోటు దగ్గర దగ్గర 12.5%గా తేల్చిన ఆర్థిక శాఖ మంత్రి జార్జ్ పాపాకాంస్టాంటినావ్[3] ఈ లోటు వలన దేశ స్థూ.దే.ఉ. 3% కన్న తక్కువకి చేరడం. ఇది యురోపియన్ యూనియన్ దేశాల సగటు స్థూ.దే.ఉ కన్న చాలా తక్కువ. యురోపియన్ యూనియన్ ఆర్థిక నిబంధనల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి-స్థిరత్వం దెబ్బతిన్నాయి.
- 2009 అక్టోబరు 22 – గ్రీకు ఋణ రేటింగును తగ్గిస్తూ ఋణ రేటింగు ఇచ్చే ఫిట్చ్ ప్ప్రకటన. A నుండి A− తగ్గిస్తూ రేటింగ్ ఇచ్చే మూడు కంపెనీలలో ఒకటైన ఫిచ్ ఈ ప్రకటన జారీ చేసింది.[4]
- 2009 డిసెంబరు 8 – గ్రీకు ఋణ రేటింగును A- నుండి BBB+కు తగ్గిస్తూ ఫిచ్ ప్రకటన జారీ చేసింది.[5]
- 2009 డిసెంబరు 16 – S&P (స్టాండర్డ్ అండ్ పూర్స్) గ్రీకు ఋణ రేటింగును తగ్గిస్తూ ప్రకటన చేసింది.[6]
- 2009 డిసెంబరు 23 – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్విస్ సంస్థ ద్వారా గ్రీకు ఋణ రేటింగును A1 నుండి A2 కు తగ్గిస్తూ ప్రకటన[7]
మూలాలు
మార్చు- ↑ వర్ల్డ్ బ్యాంకు వద్ద ఉన్న సమాచారం, http://data.worldbank.org/country/greece
- ↑ "గ్రీకు ఎలక్షన్లలో సోషలిస్టుల గెలుపు". theguardian.com. Retrieved 11 ఆగస్టు 2013.
- ↑ "బడ్జెట్ లోటును పూడ్చేందుకు గ్రీకు ప్రభుత్వ ప్రయత్నాలు". ft.com. Retrieved 11 ఆగస్టు 2013.
- ↑ "ఫిచ్ గ్రీకును A నుండి A- కు దిగజార్చింది". bloomberg.com. Retrieved 11 ఆగస్టు 2013.
- ↑ "ఫిట్చ్ ప్రకటనలో గ్రీకు ఋణ రేటింగ్ తగ్గడంతో ఆర్ధిక మార్కెట్ల అస్తవ్యస్తం". theguardian.com. Retrieved 11 ఆగస్టు 2013.
- ↑ బ్రాండిమార్ట్, వాల్టర్ (16 డిసెంబరు 2009). "S&P గ్రీకు ఋణ రేటింగ్ తగ్గిస్తూ మరింత తగ్గించే సూచనలు చేస్తూ ప్రకటన చేసింది". reuters.com. Archived from the original on 2015-07-03. Retrieved 11 ఆగస్టు 2013.
- ↑ "మూడీస్ ప్రకటనలో గ్రీకు ఋణ రేటింగు కోత". లండన్: .telegraph.co.uk. 22 డిసెంబరు 2009. Retrieved 11 ఆగస్టు 2013.