గ్లాడియోలస్ పూలను కట్‍ఫ్లవర్‍గా, అందమైన పూగుచ్ఛాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనికి సమశీతోష్ణ వాతావరణం అనుకూలం.

గ్లాడియోలస్
Gladiolus
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Gladiolus

Type species
Gladiolus communis
L.
Species

About 260, see text

నేలలు

మార్చు

తేలికపాటి నేలలు అనుకూలం. కనీసం 30 సెం.మీ. లోతుగల ఒండ్రునేలలు, ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 మధ్యగల ఎక్కువ సేంద్రీయ పదార్థం గల గుల్లబారిన భూముల్లో పూలు అధికంగా వస్తాయి.

ప్రవర్ధనం

మార్చు

దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దుంపలను తవ్వి తీసిన మూడు నెలల వరకు నిద్రావస్థ వుంటుంది. 4 సెంటీమీటర్ల వ్యాసంగల దుంపలని నాటుకొన్నట్లైతే పెద్ద పూల కాడలు వస్తాయి. దుంపలు చిన్నగా వున్నట్లైతే పూలకాడలు చిన్నగా వుంటయి. ఇంకా చిన్నగా వున్నట్లైతే పూల కాడలు ఏర్పడవు.

నాటటం

మార్చు

జూన్ నుండి డిసెంబరు వరకు నాటుకోవచ్చు. నాటటానికి ముందు దుంపలపై వుండే గోధుమ రంగు పొలుసులను తొలగించి గడ్డలని లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ కలిపిన ద్రావణంలో 15 నుంచి 30 నిమిషములు ఉంచి నాటుకోవాలి. పూల సరఫరా కాలాన్ని పెంచడానికి ప్రతి 15 రోజుల రోజుల నుండి నెల రోజుల వ్యవధిలో దుంపలను నాటుకోవడం వలన మంచి మార్కెట్‍ను పొందవచ్చు.

నాటే దూరం

మార్చు

దుంపలను 30 × 20 సెంటీమీటర్ల దూరంలో ఎకరానికి సుమారు 55 నుంచి 60 వేల దుంపలను నాటుకోవాలి.

ఎరువులు

మార్చు

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 120 నుంచి 140 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి.

నీటి యాజమాన్యం

మార్చు

వాతావరణ, భూమి పరిస్థితులననుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు యివ్వాలి. పూల కాడలు ఏర్పడే సమయంలో నీటి ఎద్దడి ఉండకూడదు.

అంతర కృషి

మార్చు

మొక్కలు పడిపోకుండ మట్టిని ఎగదోయాలి. పూత సమయంలో ఊతమివ్వాలి.

కత్తిరించటం

మార్చు

పూల కాడ మొదటి పుష్పపు రంగు కనబడిన వెంటనే పూలకాడను నాలుగో ఆకు వరకు కత్తిరించి వెంటనే కత్తిరించిన కాడ మొదలు నీటిలో వుంచాలి.

దిగుబడి

మార్చు

ఎకరాకు 36 వేల నుండి 40 వేల పూల కాడలను పొందవచ్చు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  • ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ముద్రించిన వ్యవసాయ పంచాంగం