జీపీయస్

(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నుండి దారిమార్పు చెందింది)

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీయస్) (గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ) అనగా భూమిపై, గాలిలో, నీటిపై నావిగేట్ చెయ్యడానికి సహాయపడే ఉపగ్రహాల వ్యవస్థ. GPS రిసీవర్ మనం ఎక్కడ ఉన్నామో, ఏదైనా ప్రదేశం లేదా వస్తువు ఎక్కడ ఉందో చూపిస్తుంది. వస్తువు ఎంత వేగంగా కదులుతుందో, ఏ దిశలో వెళుతుందో, ఎంత ఎత్తులో ఉందో, ఎంత వేగంగా పైకి లేదా క్రిందికి వెళుతుందో కూడా ఇది చూపిస్తుంది. చాలా GPS రిసీవర్లకు స్థలాల గురించి సమాచారం ఉంది. ఆటోమొబైల్స్ కోసం GPS లలో రోడ్ మ్యాప్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు, సేవా స్టేషన్లు వంటి ప్రయాణ డేటా ఉన్నాయి. పడవల కోసం GPS లలో నౌకాశ్రయాలు, మెరీనాస్, నిస్సార నీరు, రాళ్ళు, జలమార్గాల నాటికల్ చార్టులు ఉన్నాయి. ఇతర GPS రిసీవర్లు ఎయిర్ నావిగేషన్, హైకింగ్, బ్యాక్‌ప్యాకింగ్, సైక్లింగ్ లేదా అనేక ఇతర కార్యకలాపాల కోసం తయారు చేస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ అన్ని లేదా అధిక స్మార్ట్‌ఫోన్‌లలో ఉంది. అనేక GPS రిసీవర్లు ప్రయాణికులకు వారు ఎక్కడ ఉన్నారో తెలిపి వారి గమ్యానికి దారి చూపండంలో సహాయపడతాయి. ప్రణాళికాబద్ధమైన ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఇది తదుపరి గమ్యస్థానం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసి తెలియజేస్తుంది.

GPS రిసీవర్లు. ప్రజలు తాము ఎక్కడున్నామో గుర్తించడానికి వీటిని తీసుకెళ్లవచ్చు, తదుపరి ప్రదేశానికి ఎక్కడికి, ఎలా వెళ్ళాలో ప్లాన్ చేయవచ్చు.
"https://te.wikipedia.org/w/index.php?title=జీపీయస్&oldid=2934182" నుండి వెలికితీశారు